బి.సి రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర బందును జయప్రదం చేయండి
తెలంగాణ ఉద్యమ లాగా బి.సి ఉద్యమాన్ని ఉదృతం చేయాలి
వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షుల పిలుపు
ఎందరో మహానీయుల త్యాగపలితంగా ప్రకటించిన బి.సి రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 18 న తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బందును జయప్రదం చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్, పులి సత్యనారాయణలు పిలుపునిచ్చారు. బి.సి ఐక్యకార్యాచరణ కమిటి పిలుపు మేరకు శుక్రవారం కోర్టు గేటు ముందు బి.సి జాక్ నాయకులతో కలిసి న్యాయవాదులు చేసిన ప్రదర్శనలో బందు జయప్రదం చేయాలని వారు మాట్లాడారు. బి.సి లకు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను ఆధిపత్య కులాల వారు కుట్ర పూరితంగా అడ్డుకోవడం మానుకోవాలని, సామాజికన్యాయంలో బాగంగా విద్య , ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బి.సి లకు దక్కాల్సిన న్యాయమైన వాటాను అడ్డుకోవడం సరికాదని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించిన తరహాలో బి.సి రిజర్వేషన్ల సాధనలో కూడా ముందుంటామని అన్నారు. రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా శనివారం కోర్టు ముందు ఒకరోజు ధర్నా చేస్తామని, బందుకు సంఘీభావంగా అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ తీస్తామని తెలిపారు. ధర్నా, ర్యాలీ లో న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని బి.సి రిజర్వేషన్ల సాధనలో బి.సి న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి బి.సి రిజర్వేషన్లను అమలు చేయడానికి కృషి చేసినా న్యాయపరమైన అడ్డంకులు వస్తున్నాయని, తెలంగాణలో బి.సి రిజర్వేషన్ల పెంపుకు పార్లమెంటులో బిల్లు పెట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రతిపక్షంలో ఉన్నపుడు బి.సి కులజనగణ చేపడుతామని మాట్లాడిన బిజెపి నేడు బి.సి రిజర్వేషన్లను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. దేశంలో 60 జనాభా కలిగిన కలిగిన బి.సి ఓట్లతో మూడవసారి గద్దెనెక్కిన బిజెపి బి.సి రిజర్వేషన్లను అడ్డుకుంటే గద్దెనెక్కించిన ఇచ్చిన బి.సి లే గద్దె దించుతారని హెచ్చరించారు. బి.సి ప్రధాని అని చెపుతూ బి.సి లను అణచివేయడాన్ని, హక్కులను కాలరాయడాన్ని బి.సి సమాజం తీవ్రంగా పరిగణించి రానున్న రోజులో బిజెపిని గద్దె దించడం ఖాయమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అంబరీష్ రావు, తీగల జీవన్ గౌడ్, దయాల సుధాకర్, తాళ్ళపల్లి జనార్ధన్ గౌడ్, సిరిమల్ల అరుణ, విలాసాగరం సురేందర్ గౌడ్, గునిగంటి శ్రీనివాస్, పూసపల్లి శ్రీనివాస్, కూనూరు రంజిత్ గౌడ్, డేవిడ్, మైదం జయపాల్, సూరం నరసింహారావు, బండారి విక్రమ్, గంధం శివ, గుడిపాటి లక్ష్మి, బి.సి జాక్ వరంగల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వడ్లకొండ వేణుగోపాల్, బి.సి సంఘాల నాయకులు బొనగాని యాదగిరి గౌడ్, తమ్మల శోభారాణి, దాడి మల్లయ్య యాదవ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.


Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?