మేయర్ పదవిపైకన్నేస్తే తడాఖా చూపిస్తా- బండిసంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

BANDI SANJAY

కరీంనగర్ మేయర్ పదవిపై రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. అత్యధిక స్థానాలు గెలిచి బిజెపి మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తుండగా కాంగ్రేస్,బిఆర్ఎస్ పార్టీలు అవకశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈరెండుపార్టీలు ఓకఅవగాహనకువస్తే బిజెపికి మేయర్ పదవి దక్కే చాన్సులేదు.

దాంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కు టెన్షన్ పట్టుకుంది.

కాంగ్రేస్,బిఆర్ఎస్ పార్టీలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెండు పార్టీలు అనైతక చర్యలకు పాల్పడితే తనతడాఖా చూపిస్తానని అన్నారు.

శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఇంటెలిజెన్స్ అంచనాలను తల కిందులు చేస్తూ తమపార్టి అభ్యర్థులు ఘన జయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు.

కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీకి కేవలం 13 సీట్లు మాత్రమే వస్తాయని సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ అంచనాలను తలకిందులు చేసాయని అన్సీనారు. ఇప్పటికైనా సిఎం వాస్తవాలు గ్రహించాలని సూచించారు.

కరీంనగర్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటై కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ మాత్రం సింహంలా ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. “గుంటనక్కలన్నీ ఒక్కటైనా, సింహం ఒంటరిగా పోరాడుతుంది” అంటూ వ్యాఖ్యానించారు.

అంతకు ముందు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్–బీఆర్ఎస్–ఎంఐఎం పార్టీలు వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక్కటయ్యాయని సెటైర్లు వేశారు. ఈ మూడు పార్టీల అసలు స్వరూపం కరీంనగర్ వేదికగా బయటపడుతోందన్నారు.

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని, దీనిని రాసిపెట్టుకోవాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఏవైనా రాజకీయ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాజకీయ సమాధి చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బీజేపీ కార్యకర్తల శక్తి, దమ్ము ప్రత్యర్థి పార్టీలకు ఇంకా తెలియలేదని, త్వరలో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Share this post

One thought on “మేయర్ పదవిపైకన్నేస్తే తడాఖా చూపిస్తా- బండిసంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

  1. What i don’t realize is actually how you’re not actually a lot more smartly-favored than you might be right now. You’re so intelligent. You already know thus considerably in relation to this subject, made me in my opinion imagine it from a lot of varied angles. Its like women and men are not fascinated except it’s something to do with Lady gaga! Your own stuffs excellent. At all times deal with it up!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం