కిట్స్ వరంగల్ క్యాంపస్ లో వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025 ప్రారంభం
బాలురు, బాలికలు, పురుషులు, మహిళల వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025 పోటీలు కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి ప్రారంభించారు.
బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BAT- బ్యాట్)కి అనుబంధంగా ఉన్న వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (డబ్ల్యుడిబిఎ) 2025 జూన్ 9 నుండి 11 వరకు మూడు రోజుల పాటు “బాలురు, బాలికలు, పురుషులు, మహిళల కోసం వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2025” ను కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) క్యాంపస్ లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు వైస్ ప్రెసిడెంట్ బ్యాట్, డబ్ల్యుడిబిఎ జనరల్ సెక్రటరీ మరియు కిట్స్ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. పింగిలి. రమేష్ రెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిని గా పాల్గొన్న కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ బ్యాడ్మింటన్ ఒక డైనమిక్ ఇంకా ఆరోగ్యకరమైన క్రీడ అని అన్నారు. ఇది కొన్ని నొప్పిలేని నియమాలతో కూడిన అత్యంత ప్రేరణాత్మక మరియు ఉత్సాహభరితమైన ఆట. బ్యాడ్మింటన్ ఆట గుండె కండరాలను బలోపేతం చేస్తుందని,రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని యువతలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని అన్నారు. ఆటలలో పాల్గొనడం చాలా ముఖ్యం కానీ ఓడిపోవడం లేదా గెలవడం ముఖ్యం కాదన్నారు. ఆటలు మరియు క్రీడలు వ్యూహాత్మకంగా కలిసి ఉంటాయని విద్యార్థుల చదువులో రాణించేందుకు తోడ్పడుతాయని అన్నారు.
ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ బిఎటి, డబ్ల్యుడిబిఎ జనరల్ సెక్రటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కిట్స్ వరంగల్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి మాట్లాడుతూ సైప్రస్ జూనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్-2025 లో *శౌర్య కిరణ్ రజత పతకం* గెలుచుకున్నందుకు మరియు *కీర్తి మంచాల* ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ & ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారని, ఈ మూడు రోజులలో 26 రకాల ఆటలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ టోర్నమెంట్‌లో విజేతలు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగే రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఈ పోటీలు అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17 మరియు అండర్-19 బాలురు, బాలికలు, పురుషులు మరియు మహిళలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 170 మంది క్రీడాకారులు టోర్నీలో చురుకుగా పాల్గొన్నారు అని సగర్వంగా తెలిపారు.
ఈ ప్రారంభోత్స వకార్యక్రమంలో డబ్ల్యుడిబిఎ అధ్యక్షులు డాక్టర్ ఎస్ రమేష్ కుమార్ అధ్యక్షఉపన్యాసం చేశారు. రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాలు సాధించడం ద్వారా పేరు మరియు కీర్తిని సంపాదించినందుకు వరంగల్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లను ఆయన ప్రశంసించారు. ప్రస్తుత విద్యావ్యవస్థకు ఆటలు మరియు క్రీడలు నేటి అవసరం మరియు ఇది ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి దారితీస్తోంది. ప్రతి క్రీడాకారునికి పోరాట పటిమ తప్పనిసరి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యుడిబిఎ కోశాధికారి డి.నాగకిషన్, డబ్ల్యుడిబిఎ వైస్ ప్రెసిడెంట్, డా.ఎన్.మోహన్ రావు, కిట్స్ వరంగల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి, డాక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి, జీ కిషోర్, భాస్కర్, కృష్ణవేణి, ఎం. శైలజ, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ డి. ప్రభాకరా చారి, 210 మంది క్రీడాకారులు & వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


j3qryc
u2qzos
u4t48v
Hey are using WordPress for your site platform? I’m new to the blog world but I’m trying to get started and set up my own. Do you need any html coding knowledge to make your own blog? Any help would be really appreciated!