Headlines

మహబూబాబాద్ లో బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం


మహబూబాబాద్ జిల్లా అమ్యోచూర్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ‘యోనెక్స్ సన్ రైజ్ 11వ, తెలంగాణ రాష్ట్ర సబ్- జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

సమావేశానికి డా. యం. జితేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిదిగా డా. సన్ ప్రతి సింగ్ IPS, కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ తోపాటుగా విశిష్ఠ అతిధిగా డా. ‘టి. యాదగిరిరావు, వైస్ చాన్స్ లర్, తెలంగాణ యూనివర్శిటి హాజరయ్యారు.


ముఖ్యఅతిథి సనీప్రీత్ సింగ్ గారు మాట్లాడుతూ, వరంగల్ క్రీడలకు పుట్టినిల్లని ఏంతో మంది క్రీడాకారులు అంతర్ఝాతీయ స్థాయిలో రాణించారని వారందరిని స్ఫూర్తిగా తీసుకోని క్రీడలలో రాణించి రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీనాలన్నారు. బ్యాడ్మింటన్ లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో భారత దేశానికి మంచి గుర్తింపు తీసుకు – వచ్చారని గుర్తుచేశారు.
డా. యాదగిరిరావు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అపోయేషన్ ఏర్పడిన సంవత్సర కాలంలోనే రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం మంచి పరిణామమని ఇందుకు భాద్యులను అభినందించారు. అధ్యక్షులు డా. ఎం. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం
నలు మూలల నుండి 20 జిల్లాల క్రీడాకారులు సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని 20 మంది అంపైర్స్, కోచ్లు, మేనేజర్స్ అందరికి ఉచిత, భోజన, వసతులను కల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు డా. S.రమేశకుమార్, కార్యదర్శి డా. పి.రమేశ్ రెడ్డి, కార్యదర్శి డా. కొమ్మ, రాజేందర్ వరంగల్ జిల్లా ట్రెజరర్ డి. నాగకిషన్, వరంగల్ క్లబ్ జాయింట్ సెక్రెటర్. బి. కన్నారెడ్డి. టోర్నమెంట్ సలహా దారులు UVN బాబు, స్వాస్సరర్స్ ‘నేరెళ్ళ విజయ్, వద్దిరాజు వెంకన్న, అమరలింగేశ్వరావు, సురభి కిరణ్, వైస్ ప్రసిడెంట్ నిమ్మ మెహన్రావు. కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, రావులమురళి, వరంగల్ క్లబ్ E.C మెంబర్స్, డా. శ్రీనివాస రెడ్డి, డా. శ్రీధర్, డా. ATT ప్రసాద్, శ్యాంకుమార్, శ్యాంప్రసాద్, రెఫరీ హన్మంతరావు, చంద్రశేఖరరావు,ఎంపైర్స్ బేబి శైలజా, సాయికుమార్, సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE