ప్రజా సంఘాల ఆద్వర్యంలో
ప్రజా కవి అందెశ్రీకి ఘనమైన నివాళి
మహా కవి అందెశ్రీ ఆశయాలను కొనసాగిద్దాం
ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

పీడిత ప్రజల విముక్తి కోసం, మానవీయ విలువల సమాజ నిర్మాణం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం రచించి పాడిన మహా కవి ఆశయాలను కొనసాగించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. వివిధ ప్రజా సంఘాల ఆద్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో మంగళవారం జరిగిన ప్రజా కవి అందెశ్రీ నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పసితనంలోనే పశువుల కాపరిగా ఎన్నో కష్టాలు పడిన అందెశ్రీ తన కష్టాలతో పాటు, సమాజ కష్టాలపై నిరంతరం ఆలోచించిన అందెశ్రీ సహజ కవిగా, ప్రజా కవిగా ఎన్నో గీతాలను వ్రాసి పాడి ప్రజలను చైతన్యం చేసిన ఘనత వారికి దక్కింది. ప్రాంతీయ రాజకీయ దోపిడీలో ఆగమవుతున్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో తను వ్రాసి పాడిన జయ జయహే తెలంగాణ పాట ద్వారా యావత్ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపినారని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా కీలకపాత్ర పోషించిన పాఠశాలకు వెళ్లని అందెశ్రీకి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించిందని అలాంటి మహా కవి అందెశ్రీ బాటలో అందరూ పయనించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బి.సి మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, టిజెఎస్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది చిల్ల రాజేంద్రప్రసాద్, రాజ్ మహ్మద్, కొంగ వీరాస్వామి లు మాట్లాడుతూ వలసాంధ్ర దోపిడీ పాలనను అంతమొందించేందుకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ కెసిఆర్ దుష్ట పాలన అంతం కోసం కూడా అంతే పోరాటం చేశాడని, ప్రజల పక్షాన నికార్సుగా నిలబడి కలబడిన ధిక్కార స్వరం నేటితరం యువతకు, ఉద్యమకారులకు ఆదర్శం కావాలని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అందెశ్రీ లాంటి కవులను, కళాకారులను, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందని అన్నారు. అకాల మరణం చెందిన అందెశ్రీ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సాయిని నరేందర్, తాడిశెట్టి క్రాంతికుమార్, చిల్ల రాజేంద్రప్రసాద్, కొంగ వీరాస్వామి, రాజ్ మహ్మద్, నేదునూరి రాజమౌళి, చుంచు రాజేందర్, సంఘాని మల్లేశ్వర్, నలిగింటి చంద్రమౌళి, చాపర్తి కుమార్ గాడ్గే, మంద వీరస్వామి, సూరం నిరంజన్ పటేల్, కత్తెరపల్లి దామోదర్, జల్లెల కృష్ణమూర్తి యాదవ్, డేవిడ్, బక్కీ యాదగిరి, అనిశెట్టి సాయితేజ, పి వి చారి, ఎం రఘువీర్, నలబోల అమరేందర్, కొండి కృష్ణ గౌడ్, మామిడి రాఖీ, జె రవీందర్, బి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me? https://www.binance.info/register?ref=IHJUI7TF
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.