పట్టాదారు పాస్ పుస్తకంలో 7 గుంటల భూమి నమోదుచేసేందుకు 12 లక్షల లంచం డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ జి. కృష్ణ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసారు.
ఓ ఫిర్యాదు దారుడు తన తండ్రి పేరిట 7 గుంటల భూమి పాస్ బుక్ లో నమోదు చేయాలని revenue ఇన్స్పెక్టర్ ను సంప్రదించగా లంచం ఇవ్వందే పని జరగదని చెప్పాడు. దాంతో ఫిర్యాదు దారుడు ఆధారాలతో సహా ఏసీబీ అదికాకరులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసారు.
ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు లక్ష లంచం
ఈ సారు కథ చదవండి. ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేస్తే లక్ష రూపాయలు డిమాండ్ చేసాడు.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ మండల తహసీల్దారు వారి కార్యాలయం లోని రెవిన్యూ ఇన్స్పెక్టర్ – భూపాల మహేష్.
మొదటి ఇంస్టాల్ మెంటుగా 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు లంచం అడిగితే తెలంగాణ అవినీతినిరోధకశాఖ “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంటాయని చెప్పారు.


xjjtov
Thanks for another informative website. Where else could I am getting that kind of information written in such an ideal way? I have a mission that I am just now running on, and I have been at the glance out for such info.