కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ వరకు ఉదయ్‌ కృష్ణారెడ్డి ప్రయాణం

ఒక సీఐ చేతిలో ఎదురైన అవమానం ఓ యువకుడిని ఐపీఎస్‌ అధికారి అయ్యేలా మలిచింది. ఇది ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్‌ కృష్ణారెడ్డి విజయగాథ. చిన్ననాటి లోటు, కష్టాల్లో పెరిగిన జీవితం, ప్రభుత్వ పాఠశాలలో చదువు, ఒక పక్క కుటుంబ భాద్యతలు—all these only strengthened his will.

తల్లిదండ్రులను చిన్నవయసులోనే కోల్పోయిన ఆయనను నాన్నమ్మే పెంచింది. కూరగాయలు అమ్ముతూ మనవాళ్లను చదివించిన ఆమె ఆశయమే ఉదయ్‌ విజయానికి వేదిక అయింది. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుని, కానిస్టేబుల్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. కుటుంబానికి ఓ ఆదారం దొరికిందన్న సంతోషంలో ఉండగానే, ఊహించని ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

ఒక సీఐ చేతిలో 60 మంది సిబ్బంది ఎదుట జరిగిన అవమానం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపరేషన్ మొదలెట్టాడు. మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా, నాలుగోసారి 780 ర్యాంక్‌తో రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో చేరాడు. ఐదో ప్రయత్నంలో అలిండియా 350వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు.

ఉదయ్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా అభినందించారు. ధైర్యం, కృషి ఉంటే కానిస్టేబుల్‌ నుంచే ఐపీఎస్‌ సాధ్యమవుతుందని ఉదయ్‌ నిరూపించాడని ప్రశంసించారు.

Share this post

2 thoughts on “కానిస్టేబుల్‌ నుంచి ఐపీఎస్‌ వరకు ఉదయ్‌ కృష్ణారెడ్డి ప్రయాణం

  1. **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

  2. Thank you for another magnificent post. Where else could anyone get that kind of info in such a perfect way of writing? I’ve a presentation next week, and I’m on the look for such information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన