కేసీఆర్, కేటీఆర్, హరీష్ అసత్యాలు ఆపకుంటే ఖబడ్దార్
నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
బిఆర్ఎస్ నేతల అవినీతి బురదను మాకు అంటించాలని చూస్తున్నారా?
నాదర్ గుల్ భూములపై కర్త కర్మ క్రియ బిఆర్ఎస్ ప్రభుత్వమే
2014లో ప్రారంభమైన వారి దోపిడీ 2023 వరకూ సాగింది
ఆ భూమిపై మేమే కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నాం
హరీష్‌రావు ( అబద్దాల రావు) కేటీఆర్ ( డ్రామారావు), కేసీఆర్ ( శకుని మామ) పూర్తి అవినీతిపరులు
అధికారంలోకి రాకముందు వారి ఆస్తులు ఎంత? ఇప్పుడు వారి ఆస్తులు ఎంత?
అది గుమస్తా తెలంగాణ పేపర్, దాని ఆత్మ శకుని మామ
కల్వకుంట్ల కుటుంబ అవినీతికి ఆహోమ్- ఈహోమ్ అనే మైహోమ్ అండగా ఉంది
బురదపూసుకున్న అడవిపంది సింహానికి బురద అంటించే ప్రయత్నం
గజ్జికుక్కల్లాగే బిఆర్ఎస్ వ్యవహారం ఉంది.
రాఘవ కనస్ట్రక్షన్ మోచేతి నీరు తాగిన కీసీర్ కేటీఆర్ హరీష్‌రావులు గతం మరచిపోవద్దు
అబద్దాల హరీష్ రావు ఆరోపణలపై ‘సింహం’లా విరుచుకుపడ్డ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’.. ప్రభుత్వానికి ఏం సంబంధం?
కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు
హైదరాబాద్ :- ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, పలువురు మంత్రులపైనా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్‌లో హరీష్‌రావు, కేటీఆర్‌లు చేస్తున్న పలు ఆరోపణలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం నాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు శ్రీమతి సీతక్క, పొన్నంప్రభాకర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, సామెల్ , బి.లక్ష్మారెడ్డి, శ్రీ గణేష్, రాంమోహన్ రెడ్డి తదితరులతో కలిసి తనదైన శైలిలో బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.
శకుని మామ కేసీర్ డైరెక్షన్‌లో అబద్దాల హరీష్‌రావు, డ్రామారావు కేటీఆర్ లు మా ప్రభుత్వం, మా మంత్రులపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని మామలు.. ఇప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని రె మంత్రి ధ్వజమెత్తారు. నాదర్గుల్, వట్టినాగులపల్లి మరియు కొత్వాల్‌గూడ అంశాలపై మంత్రి ఆధారాలతో సహా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు
మంత్రి పొంగులేటి మాటల్లో… “నాదురుగుల్ లో సర్వే నెంబర్ 613 నాదురుగుల్ గ్రామంలో, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇందులో ఉన్న 373 ఎకరాల 13 గుంటలు. ఇది ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా, రకరకాలుగా అనేక కోర్టుల్లో దీన్ని కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పార్టీ గెలవడం, ఒకసారి ప్రభుత్వం గెలవడం, పైకోర్టులకు పోవడం, పోలీసు సపోర్ట్ కోర్ట్ డైరెక్షన్ తెచ్చుకోవడం ఆ నాటి ప్రభుత్వంలో కొన్నిజరిగాయి. దీంట్లో గమనించాల్సిన విషయం ఉంది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమెగా డెవలప్మెంట్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు సంస్థలకు 1-9-2014 నాడు మీ ప్రభుత్వంలోనే నాదురుగుల్ గ్రామాన్ని613 సర్వే నెంబరులో రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను 2016 సెప్టెంబర్ 24 మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? 2014లో కానీ, 2016లో కానీ ప్రభుత్వం ఎవరున్నారు? అధికారంలో ఎవరున్నారండి అబద్ధాల రావు గారు? ఇందాక చెప్పిన మూడు కంపెనీలకు ఫైల్ నెంబర్ బి/1351/2/2021-1-1, 2021-2, 2021-3, 2011-3 వీళ్లకు మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ వివరాలతో కూడిన డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ జరిగితే ప్రస్తుత ప్రభుత్వానికి ఏమిటి సంబంధం?
అంతేకాదు ఈ డ్రామాలరావు , ఈ అబద్ధాల రావు గారు ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో చెబుతా. 10-02-2021 గూగుల్ మ్యాప్.. చూడండి. ఇక్కడ అప్పటికీ ఏమి ఏర్పాటు చేయలేదు. ఏ రేకులు పెట్టలేదు. ఏ రోజు వేయలేదు. అదే విధంగా 05-12-2021 ఈ గూగుల్ మ్యాప్ లో కలర్ తో కొన్ని ప్రాంతాల్లో మొదలుపెట్టాడు. రేకులు కట్టడం, రోడ్లు వేయడం మొదలుపెట్టాడు. 5-12-2021 నేను చూపించే ప్రతిదీ మీకు గూగుల్ లో కనిపిస్తుంది. నేనేమి మానిప్యులేట్ చేసేది కాదు. నా ప్రభుత్వం, నా అధికారులు తయారు చేసిచ్చింది కాదు. అదే విధంగా 5-1-2022 రేకులు, రోడ్లు వేసింది గూగుల్ పిక్చర్ లో కనిపిస్తుంది. 17-11-2022లో పూర్తిగా కలర్ తో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని 2022-11 నెలలో పూర్తిగా మీ టైంలో షీట్లు పెట్టి దానికి పూర్తిగా రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఎవరున్నారండి అధికారంలో ఆ నాడు అబద్ధాలు రావు గారు, డ్రామా రావు గారు. 2022 నవంబరులో మీ దొర పాలనే ఉంది కదా? ఇది నేను తయారు చేసింది కాదు కదా? ఇలా ప్రతి మ్యాపులో ప్రజాప్రభుత్వం వచ్చే వరకు ఐదు మ్యాపులు తెప్పించాను. ప్రతి మ్యాపులో 373 ఎకరాల 22 గుంటలకు నీ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వం మీద ఈ మంత్రి మీద నిందలు మోపుతావా? ఎవరేశారు రేకులు? రిజిస్ట్రేషన్ ఎవరి టైంలో జరిగింది? మ‌్యుటేషన్ ఎవరి టైంలో జరిగింది?
ఇంకో విచిత్రం ఏమిటంటే.. వాళ్లు నాలా చేయమంటే మేము చేయమన్నాం, నాలా చేయం అన్నందుకు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి కొట్లాడినం అంటున్నారు. కోర్టుకు 2022లో ఎస్ఎల్పీ నెంబర్ 15415-2022లో వారు సుప్రీంకోర్టుకు పోతే ఆ ఎస్ఎల్పీకి 2022లో పోతే మీ ప్రభుత్వం ఉన్నంత వరకు కౌంటర్ వేయలేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 17-03-2025 ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రెవెన్యూ కేసులు ఏ కోర్టులో పెండింగ్ ఉంటున్నాయని పరిశీలించిన తరువాత, దీని మీద ప్రభుత్వ పక్షాన పూర్తిగా కౌంటర్ మా ప్రభుత్వం తరువాత వేసింది. మా ప్రభుత్వం వచ్చిన ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని నాలా చేయలేము అని ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మేమేశాం. మీరు వేయలేదే? కౌంటర్ వేసింది మేము. దీనిపై కొట్లాడుతుంది మేము.
మరొక విచిత్రం ఇది గుమస్తా తెలంగాణ పేపర్. ఈ గుమస్తా తెలంగాణ శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మ గుమస్తా తెలంగాణలో కొట్లాడుతుంటది. ఈ గుమస్తా తెలంగాణలో హెడ్ లైన్ చూశారు. ఈ జాగీర్ లోకి మెగా ఎంట్రీ. ఈ జాగీర్ లోకి మెగా ఎంట్రీ అని గుమస్తా తెలంగాణలో బ్యానర్ ఐటం రాస్తారు. రాసి మూడో రోజు ఈ ఐటం రాసిన మూడో రోజే మళ్లీ బ్యానర్ ఐటం. పొంగులేటి ఈ స్థలం కబ్జా. మొదటి రోజు మెగా కబ్జా అని రాస్తావ్, మూడో రోజు పొంగులేటి కబ్జా అని రాస్తావ్. దీంట్లో ఆంతర్యం ఏమిటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో మీకు తెలియంది కాదు. ఐతే ప్రభుత్వం మారిన తరువాత ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత ఈ మెగా ఈ ల్యాండ్ ను చేసుకుంటే వారికున్న డీల్స్ ఎవైతే ఇవ్వము అని బ్యానర్ వేసి రెండో రోజు.. ఈ గుమస్తా పేపర్ శకుని కొడుకు, అబద్ధాల రావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. మీ వాటా మీకొస్తది.మీకిచ్చేది మీకిస్తామని సెటిల్ అయిన తరువాత, దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నింద మోపుతారు. మరి అబద్ధాల రావు రోల్ ఏంటంటే.. శకుని మామ, వారి కుటుంబమే షేర్ చేసుకుంటే నా పరిస్థితి ఏమిటని ఈ అబద్ధాల రావు రంగంలోకి వచ్చి దీనిపై వానర సైన్యాన్ని వేసుకొని, ఈ ల్యాండ్ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం 7వేల కోట్లు మింగింది అంటడు. అసలు నాదర్గుల్ ల్యాండ్ కి ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నిషేధిత జాబితాలో 22ఏలో ఉన్నదా అంటే.. యాజిటిజ్ గా ఉంది. ప్రభుత్వం ఎక్కడా మార్చలేదు. ఫుల్‌స్టాప్, కామా పెట్టలేదు. మేమేమి క్లియర్ చేశామా అంటే చేయలేదు. మరి ఎట్ల ఊహించి ఇదంతా చేస్తున్నావు. నీ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని, పదేండ్లలో చేసిన బాగోతం ఎక్కడ బయటకొస్తుంది. రోజుకొ అబద్ధం కల్పించుకొని ప్రజల మధ్య తిరగడం తప్ప.. ఇందులో అసత్యం, సత్యం ఎంత ఉందో.. నేను చూపించిన ఆధారాల ప్రకారం, అబద్ధాల రావు, డ్రామారావు, వారి అధిపతి శకుని మామ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అంటే నీకు కమిషన్ వచ్చినంత వరకు నీ ప్రభుత్వంలో, మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకం విషయం వచ్చే వరకు, అవి పరిష్కరించుకునే వరకు డ్రామారావు, అబద్ధాల రావు, శకుని, శకుని కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వరు. కూతురుకైనా, ఏ ఒక్క ఆరోపణలకైనా అబద్దాలరావు సమాధానం చెప్పాడా? కాళేశ్వరం, డైరీల గురించి ఎత్తుకుంది. ల్యాండ్ లు ఎలా కబ్జా చేసిందో ఎత్తుకుంది. దేనికైనా సమాధానం చెప్పిండా ఆ శకుని మామ కూతురుకు. నేను వేసే ప్రశ్నలు కాదు. నాదర్గుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో రిజిస్ట్రేషన్ 2014 నీ ప్రభుత్వంలో జరిగింది. 2016 మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వం. ఎస్ఎల్పీలో 2022లో కౌంటర్ వేయకుంటే, 2026లో కౌంటర్ వేసి కొట్లాడుతుంది మేము. 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి రోడ్లు వేయించింది మీ టైంలో. ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎందుకు ప్రభుత్వంలోని మంత్రులను, నన్ను ఎందుకు లాగుతున్నావు?
ఇంకో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు దీంట్లో.. నా కొడుకు హర్షా రెడ్డి గురించి చెబుతాడు. దీంట్లో పార్టనర్ అంటాడు. ఏ మూడు కంపెనీలు దీంట్లో పార్టనర్లు అంటున్నాయో, ఏ కంపెనీలో ఈ భూమిని క్లెయిమ్ చేస్తున్నాయో, ఆ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలలో నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే.. ఛాలెంజ్.. అబద్ధాలు రావు.. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, అవుట్ డేటెట్ కేస్ తెచ్చి, దాన్ని ఇదిగో అని అబద్ధాన్ని పేపర్ చూపించి చిత్రీకరించొద్దని ఖబర్దార్ అని వేదికగా హెచ్చరిస్తున్నా.
ఇక రెండో అంశం వట్టినాగులపల్లిది.. ఇదొక బాగోతం. ఇదొక పచ్చిబూతు. ఇది షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయితీ. వారందరూ కుటుంబ సభ్యులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం కొనుకున్న భూమి. కుటుంబానికి సంబంధించిన భూమిలో ఒక పార్టనర్ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో.. వట్టినాగులపల్లి కుటుంబ విషయాన్ని ప్రభుత్వానికి అంటగడతారు. ప్రభుత్వ మంత్రులకు, కుటుంబ సభ్యులకు అంటగడతారు. అక్కడ యదార్థం ఏంది? దాంట్లో నీ స్వార్థం ఏంటి? ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఈ అబద్ధాల రావు కానీ,ఈ డ్రామాల రావు కానీ, శకుని మామ కానీ లాభ ఆక్షేపణ లేకుండా పుల్ల తీసి ఇటు పెట్టరు. వారికొచ్చిన లాభమేంటో చెబుతాను. షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి. ఆ కంపెనీ డెవలప్మెంట్ కు తీసుకుంటే, ఆ డెవలప్మెంట్ కు సంబంధించిన షా కుటుంబానికి సంబంధించిన ఆస్తి.. ప్రజలంతా వివరాలను చూడాల్సిందిగా విన్నవిస్తున్నా. ఇది వట్టినాగులపల్లిలో వారు చెబుతున్న భూములు. ఈ భూముల్లో ఏందయ్యా అంటే.. మ్యాప్‌లో గ్రీన్ కలర్ సంబంధించినది. ఆ హోమ్, ఈ హోమ్ అని పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా.. అబద్ధాల రావు, డ్రామారావు, శకుని మామకు సంబంధించిన సంస్థ ఆ హోమ్, ఈ హోమ్ అని ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన సంస్థ ఈ గ్రీన్ కలర్ కు సంబంధించింది డెవలప్మెంట్ తీసుకుంది. ఈ బ్లూకలర్ కు సంబంధించింది ఇంకొకరు తీసుకున్నారు. దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఒక ఈ రెడ్ కలర్ కు సంబంధించింది షా కుటుంబం పంచాయితీ ఉంది. అది వారి అన్నదమ్ములది. దీంట్లో ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఓఆర్ఆర్ ఏర్పాటు చేసేటప్పుడు, ఓఆర్ఆర్ లో సర్వే నెంబర్లకు చెందని కొంత ఆస్తి ప్రభుత్వం సేకరించింది. సేకరించినప్పుడు భూమి తగ్గింది. భూమి ప్రభుత్వం తీసుకున్న తరువాత ఏదైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే అధికార పార్టీ అండ ఉంటదో, వారిది నాదని ఫెన్సింగ్ వేసుకొని డిమార్కేషన్ చేసుకుంటారు. అలా చేసుకున్నదే ఈ గ్రీన్ పార్ట్. ఆ హోమ్, ఈ హోమ్ అనే కంపెనీ ఒక ఓనరు దగ్గర నుంచి చేసుకుంది. షా కమ్యూనిటీకి సంబంధించింది కాదు. ఈ ఆ హోమ్ ఈ హోమ్ ఏదైతే ఉందో.. వీళ్ల కోసమని ఈ ఓఆర్ఆర్ పోయిన భూమి తమకు సంబంధం లేదు. మా బిట్ ఇదని ఈ గ్రీన్ పార్ట్ కు సంబంధించిన 21 ఎకరాల 28 గుంటలు పొజిషన్ లోకి వచ్చారు. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పోయిందో. అది పోయిన తరువాత ఆ ఓఆర్ఆర్ వాళ్ల షేర్ డిలీట్ చేసుకోకుండా ఆ కుటుంబంలో వచ్చిన సమస్య. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు.
19-08-2023 నాడు సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం, ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా ఈ భూమిని ఆ శకుని మామకు సంబంధించిన ఆ హోమ్, ఈ హోమ్ అనే కంపెనీ డెవలప్మెంట్ కు తీసుకున్న భూమిని నాలా కన్వర్షేన్ ఆ నాటి ప్రభుత్వం చేసింది. ఎన్నికలకు 15 రోజుల ముందు. చేసి దాంట్లో అనేక లావాదేవీలు పెట్టుకొని దాన్ని చుట్టూ ఫెన్సింగ్ చేశారు. రేకులు పెట్టారు. పెట్టి దాన్ని పొజిషిన్ లో తీసుకున్నారు. అమాయకుడైన సర్వే నెంబర్ 245, షాకు సంబంధించిన కుటుంబ సమస్య ఏదైతే ఉందో.. ఈ భూమి అతన్ని రెచ్చగొట్టి దాన్ని పరిపరి విధాలుగా చిత్రీకరించారు. దానికి కారణంగా గ్రీన్ లో రావలసిన లావాదేవీలు, యదార్థంగా పోయిన భూమి తగ్గితే వారి షేర్ తగ్గుతుంది. అందుకే షేర్ తగ్గుతుందనే లక్ష్యంతో షా ను రెచ్చగొట్టి ఈ రాద్దాంతమంతా చేసి.. దీంట్లో ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందని దీనికో రంగు వేస్తాడు. దీంట్లో ఇంకో పచ్చి అబద్దాం ఆడుతాడు. ఇది పల్లవి షా ఎవరైతే రెడ్ కలర్ కు సంబంధించిన ఓనర్లలో ఒక ఓనర్ కూతురు. ఆమె డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు లెటర్ రాశారు. సర్వే చేయాల్సిన నోటీసు మాకు అందింది. అసలు ఈ సర్వేకు సంబంధించిన మా భూమి ఇది అని ఆమె నోటీసు అందినట్లు ఆక్నాలెడ్జ్ మెంట్ కు సంబంధించిన విషయం లెటరులో ఉంది. ఆమె స్వయంగా రాసిన లెటర్. వీరేమంటారంటే అసలు వాళ్లు నోటీసు ప్రభుత్వం సర్వే చేస్తున్నట్లు ఇవ్వలేదు. సర్వే చేసేది షా కుటుంబానికి తెలియదని విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు రహస్యంగా మళ్లీ చెబుతున్నా, దీంట్లో నా కొడుకు కేవలం డెవలప్మెంట్ కు తీసుకున్న కంపెనీలో పార్టనర్. అది డెవలప్మెంట్ కు తీసుకున్నాం తప్ప కొనలేదు. దాన్ని సర్వే చేయడానికి నోటీసు ఇస్తుందన్నది వారు. దీంట్లో అబద్ధాల రావు, డ్రామా రావు కంపెనీ ఎంటర్ అవ్వడానికి కారణం ఆ హోహ్, ఈ హోమ్ కు సంబంధించిన కొంత భూమి ఓఆర్ఆర్ పోయింది తగ్గితే, కోరేటర్ తగ్గుతందని దాన్ని ప్రభుత్వంపై రుద్దడం బాధాకరం. గౌరవ కోర్టులో వివాదం ఉంది. కోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తే ప్రభుత్వం ఆ తీర్పుకు కట్టుబడి ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు.
కొత్వాల్‌గుడా విషయంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఎలా అబద్ధాలు మాట్లాడాడో.. అది కూడా పచ్చిఅబద్ధాలు. అబద్ధాల రావు గురించి ఇది కూడా చెప్తా. దీంట్లో, ఏదైతే కొత్వాల్ గూడలో క్రషర్ కు సంబంధించిన సబ్జెక్ట్. రాఘవ కన్ స్ట్రక్షన్ హైదరాబాద్ లో రేడియల్ రోడ్డు చేస్తోంది. ఆ రేడియల్ రోడ్డు డిపార్టుమెంట్ కు తిరుమల కన్ స్ట్రక్షన్ మెటల్ సప్లై చేస్తోంది. 2007 నుంచే క్రషర్ నడచుకుంటోంది. అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజుకు తీసుకొని కుమార రాజు అనే అతను క్రషర్ నడుపుకుంటున్నాడు. అందులో ఒక చిన్న ఇల్లు అతనికి ఉంటుంది. పవర్ బిల్లువు కూడా ఉంటాయి. ఎప్పటి నుంచో వస్తున్న కరెంటు బిల్లులు ఎస్టాబ్లిష్‌మెంట్ అయ్యింది. మోకాలికి బోడుగుండుకు ముడివేసి రాఘవ కన్ స్ట్రక్షన్ సంబంధం ఉండదంటాడు. మంత్రి కుటుంబానికి సంబంధం ఉంటుందంటాడు. తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ కరెంట్ బిల్లు అక్కడే ఉంటుంది. కరెంట్ ఉంటుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇస్తాను. దీనికి సంబంధించిన దాంట్లో ఓఆర్ఆర్ వచ్చిన తరువాత కాలుష్యం గుర్తించి ప్రాంతంలోని క్రషర్లను సీజ్ చేశారు. తీసేయమని ఆదేశించారు. క్రషర్ తీసేసిన తరువాత, రాఘవ కన్ స్ట్రక్షన్ మెటీరియర్ అవసరం ఉందో.. బుద్వేల్ లో వందలాది ఎకరాలు ఆక్షన్ పెట్టారు. ఆ ప్రదేశంలో బండను పగలకొట్టి రోడ్లు వేసి, ఆ రాక్ మక్కుకు సంబంధించిన మక్కుని క్రష్ చేస్తే తిరుమల వారి నుంచి రాఘవ కన్ స్ట్రక్షన్ కొనుకున్నారు. దానికి పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ క్రషర్ ఒరిజినల్ గా కర్నూలులో రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషనర్, వర్క్ అయ్యాక అమ్మేటప్పుడు తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాల్లు కొనుకున్నారు. క్రషర్ పెట్టుకొని కొత్తగా కోరీలు తిరుమల ఇండస్ట్రీ వారు ఏం చేయలేదు. ఒక బ్లాస్టర్ కూడా చేయకుండా, బుద్వేల్ ల్యాండ్ రోడ్లకు వచ్చే స్పాయిల్ తిరుమల ఇండస్ట్రీ మెటల్స్ వారు క్రష్ చేస్తే రాఘవ వారు కొని వాడుకోవడం జరిగింది. దీంట్లో ఆర్టీఏ కింద అబద్ధాల రావు టీం, డిపార్ట్మెంట్ వాళ్లను లెటర్ అడుగుతారు, దాంట్లో మైనింగ్ వారు, అసెంబ్లీలో ఇదిగో పేపర్ అని చూపించేది, రాఘవ ఎంత సీనరైజ్ కట్టాలని చూపిస్తారు. ఆ మెటల్ కు సంబంధించిన సీనరైజ్ అనేది హెచ్ఆర్డీసీఎల్ రేడియల్ రోడ్ ఫార్మేషన్ చేసే డిపార్ట్మెంట్, వారు రెండు కోట్ల 77 లక్షలు కడతారు, నిన్ననో మొన్ననో మళ్లీ కట్టారు. అయితే క్రషర్ కు , రాఘవ సంస్థకు సంబంధం ఏంటి. మొదటి నుంచి తిరుమల మెటల్ ఇండస్ట్రీ వారిదనేది ఆధారం ఉంది. పూర్తి ఎస్లాబ్లిష్మెంట్ డాక్యుమెంట్ ఉంది. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో జీఎస్టీ, ఇతర రాత్ర కూడా పూర్తి ఆధారాలతో ఉన్న పేపర్లు మీకిస్తా. పవర్ బిల్, ప్రతిదీ ఉంటుంది. రాఘవ కన్ స్ట్రక్షన్ కు, క్రషర్ కు సంబంధం ఏంది? ఎట్లంటవు? అంటే ఇదిగో అధ్యక్ష అని అసెంబ్లీలో చెబతాడు. ఆ అబద్ధాల రావు ఉరి వేయమంటడు.. లీటర్ పెట్రోల్ కొనడానికి వంద రూపాయలు ఉంటుంది కానీ, అగ్గిపెట్ట లేదన్నదాంట్లో అబద్ధం ఎంతుందో.. ఇది కూడా అంత అబద్ధం. నిజాలను అబద్ధాలు, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించాలని తాపత్రయం.
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కథ చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయంట. సింహం అడవి పంది ఎదురుపడ్డాయంట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వది చేయలేవు, నువ్విది చేయలేవు. ఎత్తుగా లావుగా ఓ ఉన్నవ్ అని ప్రేలాపనలు పలుకుతుందట. పేలి సింహానికి ఒక స్టేజీలో కోపం వచ్చిందట.. వస్తే సింహం రెండొడగులు ముందుకు వేసేసారికి అడవి పంది పక్కనే పెద్ద బురద గుంటలో పోయి.. మొత్తం బురద పూసుకొచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అది బురద రాసుకుంటే, సింహం బురద రాసుకుంటది.. పది సంవత్సరాల్లో ఏదైతే రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయం పడుతోందో.. ఆ టీం అబద్ధాల రావు గానీ, డ్రామా రావు గానీ, శకుని మామ కానీ ఎలా తాపత్రయ పడుతున్నారో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఒక్క మూడు అంశాలే కాదు, ప్రతిరోజూ నిరంతరం ఒంటి నిండా విషం నింపుకొని, ఈ విషాన్ని ఎట్ల, మనం ఎట్లా మునిగిపోయం, ఒంటి నిండా ఎలా బుదర అంటింది. ధరణిలో జరిగిన అవకతవకలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ లో రెండు జిల్లాలది వచ్చింది. మిగతా జిల్లాలది రాబోతుంది. అవన్నీ పెట్టక ముందే, మనకంటిన బురద వారికి పూస్తే ఇద్దరం బురద రాసుకున్నోళ్లం అవుతామని పగటి కలలు కంటున్నారు
మీరు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చి, అధికారంలో దిగే ముందుకు డ్రామాలరావు గారు కానీ, అబద్ధాల రావు గారు కానీ, శకుని మామ గారెకి కానీ, వారి కుటుంబానికి ఉన్న ఆస్తులెంతా? ఈనాడు మీకున్న ఆస్తులెంత. మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరంటున్నారు అసెంబ్లీలో అబద్ధాలు రావు అంటున్నారు.. డ్రామారావు చప్పట్లు కొడతారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఎవరిదో మీకు తెలియదా అని అడుగుతున్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్ మోచేతి నీరు తాగినోళ్లు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ, ఈ అబద్ధాల రావు, డ్రామా రావుకు బాగా తెలుసు. అంతేకాదు మాయమాటలు చెప్పి, తడి బట్టతో నా గొంతు కోసిన తరువాత, నీ పార్టీకి ఇదే రాఘవ కన్ స్ట్రక్షన్ నుంచి అధికారికంగా కోటి రూపాయలు ఇచ్చానని మరచిపోయావా అబద్ధాల రావు. అప్పుడే తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నావా డ్రామాలరావు? మోచేతి నీళ్లంటే కోటి రూపాయలతో కాదు. ఈస్టోరీ మీ అంతరాత్మకు తెలుసు. అంతేకాదు ముఖ్యమంత్రి శాసనసభ సమావేశంలో డైరెక్టుగా చెప్పారు.. మీకు చాలెంజ్ విసిరారు. ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ కు రాఘవ కన్ స్ట్రక్షన్ సంబంధం ఉందని.. రోడ్లకు మెటల్ పంపే కంపెనీ మీద సీబీసీఐడీ ఎంక్వైరీ వేస్తూ, ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడిపై ఆరోపణలు చేస్తే, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు ఆ కంపెనీకే కాదు, విదేశాలకు వేలాది కోట్ల రూపాయల సంపద తరలించిన కంపెనీలపై కూడా సీబీసీఐడీ విచారణ. 2014 తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన గనుల శాఖ పది సంవత్సరాల పాలనలో అబద్ధా లరావు, డ్రామారావు, శకుని మామ ముగ్గురే మంత్రులు. ఈ ముగ్గురు ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సీబీసీఐడీ ద్వారా ఎంక్వైరీలో వస్తుంది. అంతేకాదు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందో చూడండి.
వట్టినాగులపల్లిలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే.. ఎవరి పేరైతే దాంట్లో రాశారో దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నా మీలాగా వారి పేర్లు తీయకుండా ఎఫ్ఐఆర్ చేసింది. అది మా చిత్తశుద్ధికి నిదర్శనం, మీలాగా ప్రభుత్వంలో ఉన్నారని, ప్రభుత్వ పెద్దలు కంప్లైంట్ ఇచ్చిన మాత్రంలో ఆ పేర్లు తీసేయాలని ఎవరు చెప్పలేదు. చెప్పరు కూడా. అయినా యాజిటిజ్ గా ఉన్న పేర్లు ఎఫ్ఐఆర్ చేశారు. రేపు విచారణలో.. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఎక్కువ మాట్లాడను. విచారణలో చేసిందెవరో, చేయించిన దాని వెనుక ఎవరి పాత్ర ఉందో, ఏ హోమ్ పాత్ర ఉందో.. ఆ హోమ్ కు వత్తాసు పలికేదెవరో తప్పకుండా వస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో సామెత ఉంది. గజ్జికుక్క.. ఊళ్లో ఒక సావు, ఒక శుభ అశుభ కార్యం జరుగుతుంటే వంటలు ఏర్పాటుచేస్తారు. వంటలు చేసేటప్పుడు కొన్ని గజ్జి కుక్కలు ఉంటాయి అక్కడ. ఆ గజ్జి కుక్కను వంటల దగ్గరకు రావొద్దని వంట వారు పారద్రోలాలని చూసి ఆ గజ్జి కుక్కు పోతుందా. అక్రమ ఆస్తులు, సంపాదన కోసం వంటల్లాంటి ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టాలని, ఇంకా దౌర్జన్యం చేసి బెదిరించి భయపెట్టి, అధికారంలో మేమే ఉన్నామని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శించాలని చూస్తే గజ్జికుక్కు పట్టిన గతే పడుతుంది.
వారి అక్రమ ఆస్తులను కాపాడుకోవడం కోసం, భయబ్రాంతులను చేయాలని ఇలా తాటాకు చప్పుళ్లు చేస్తేనో, ఇలా కారుకూతలు కూస్తేనో, ఇందాక చెప్పిన గజ్జికుక్క, అడవి పందిలా చేస్తేనో ప్రభుత్వం భయపడదు. చాలా స్పష్టంగా చెబుతున్న, అడవి పంది ఎలా బురదను పూసుకొచ్చి సింహానికి పూయాలని తాపత్రయ పడితే, ఆ సింహం తిరగబడి అడవి పందిని బురదలోంచి లేకుండా తొక్కి చూపిస్తుంది. మీ అక్రమాలు చిట్టా మీ భూదందాల చిట్టా, మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి మా మిత్రలుు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటకు తీసే సందర్భంగా తప్పకుండా తొందర్లో ఉంటుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది “అని అన్నారు


AquaSculpt is a high-quality metabolic support supplement created to help the body utilize fat more efficiently while maintaining steady
GL Pro is a natural dietary supplement formulated to help maintain steady, healthy blood sugar levels while easing persistent sugar cravings.
PurDentix is a revolutionary oral health supplement designed to support strong teeth and healthy gums. It tackles a wide range of dental concerns, including gum inflammation and tooth decay
Backbiome is an advanced daily wellness supplement formulated to help support spinal comfort, reduce feelings of built-up tension, and promote freer, smoother movement throughout everyday life.
NerveCalm is a high-quality nutritional supplement crafted to promote nerve wellness, ease chronic discomfort, and boost everyday vitality.
Boostaro is a modern mens wellness formula created to support daily vitality, stamina, and confidence through a practical, natural routine.
ProDentim is a modern oral-health supplement formulated with specialized probiotics and naturally sourced ingredients to help maintain firm teeth
ProDentim is a distinctive oral-care formula that pairs targeted probiotics with plant-based ingredients to encourage strong teeth, comfortable gums, and reliably fresh breath.
Backbiome is an advanced daily wellness supplement formulated to help support spinal comfort, reduce feelings of built-up tension, and promote freer, smoother movement throughout everyday life.
AquaSculpt is a high-quality metabolic support supplement created to help the body utilize fat more efficiently while maintaining steady
GL Pro is a natural dietary supplement formulated to help maintain steady, healthy blood sugar levels while easing persistent sugar cravings.