Headlines

ఏపీకి బిల్ గేట్స్‌ – ఆ ఘనతనాదే నన్న చంద్రబాబు

chandrababu

ఈ నెల 16న ప్రపంచ ప్రఖ్యాత దాతృత్వవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు Bill Gates అంద్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు.ఈవిషయం ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్వయంగా వెల్లడించారు. అమరావతి అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మీడియాతో తానే మూడోసారి బిల్ గేట్స్‌ను రాష్ట్రానికి తీసుకొస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

హైటెక్ సిటీ అభివృద్ధి సమయంలో తొలిసారి, అనంతరం విశాఖలో అగ్రిటెక్ కార్యక్రమాల కోసం రెండోసారి బిల్ గేట్స్ వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం “సంజీవని” పథకం కార్యక్రమం కోసం ఆయన రానున్నారని వెల్లడించారు. ఈ సంజీవని స్కీమ్‌కు సంబంధించి RTGS‌లో ప్రత్యేక కార్యక్రమ రూపకల్పన చేసినట్లు సీఎం వివరించారు.

అభివృద్ధి అంశంపై మాట్లాడిన చంద్రబాబు, 1982లో హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ దాటితే అడవిలా ఉండేదని గుర్తుచేశారు. కానీ నాలుగేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అలాంటి మార్పులే అమరావతి అభివృద్ధిలో కూడా కనిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరు నివేదికను తయారు చేసి సీల్డ్ కవర్‌లో అందజేస్తున్నామని చెప్పారు. మొత్తం తొమ్మిది పారామీటర్ల ఆధారంగా సర్వే నిర్వహించి, అందులో తేలిన అంశాలనే నివేదికలో చేర్చుతున్నామని వివరించారు. ఎమ్మెల్యేలకు తెలియని కొన్ని పారామీటర్లు కూడా తన వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా మారకపోతే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరోవైపు, మంత్రి Nara Lokesh పనితీరుపై స్పందిస్తూ, తాను మరియు లోకేశ్ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా మంగళగిరి చీరలకు మంత్రి లోకేశ్ మంచి బ్రాండింగ్ కల్పిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…