యూట్యూబ్,ఇన్స్ స్టాగ్రామ్,ఫేస్ బుక్ వంటిసామాజిక మాధ్యమాల పిచ్చి యువత భవిష్యత్ ను చిత్తు చేస్తోంది. ఇదిమత్తుపదార్థాల కన్నా మించిన వ్యసనంగా మారింది. వ్యూస్ కోసం కావచ్చు లేదా ఈమాద్యమాల ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న ఆశకావచ్చు యువతను నిర్వీర్యం చేస్తోంది. వీటిమాయలో పడిన యువత బయటికి రాలేక పోతున్నారు.
సామాజిక మాధ్యమాలపై మోజు యువతలో ఆందోళనకర స్థాయికి చేరుతోంది. యూట్యూబ్ ద్వారా పేరు, డబ్బు సంపాదించాలన్న ఆశతో ఓ యువకుడు కుటుంబ ఆస్తిని అమ్మి స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆశించినంత వ్యూస్ రాకపోవడంతో నిరాశకు గురై స్టూడియోకు నిప్పు పెట్టిన ఘటన Jharkhand రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, Garhwa జిల్లాకు చెందిన 27 ఏళ్ల విధాయక్ ప్రజాపతి కొంతకాలం క్రితం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. మంచి క్వాలిటీ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ఖరీదైన కంప్యూటర్లు, లైటింగ్ వ్యవస్థలు, ఇతర పరికరాలతో స్టూడియో ఏర్పాటు చేశాడు. ఇందుకోసం కుటుంబ ఆస్తిలో కొంత భాగాన్ని విక్రయించినట్లు సమాచారం.
అయితే ఛానల్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఫిబ్రవరి 7న తన స్టూడియోకు నిప్పు పెట్టడంతో పరికరాలన్నీ దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇనుప తలుపు వెనుక చిక్కుకుపోయి సహాయం కోసం అరవాల్సి వచ్చింది.
సమీప నివాసితులు పోలీసులకు సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు వచ్చే సరికి యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం బంధువులు అతడిని గుర్తించి Ranchi లోని సైకియాట్రిక్ ఆసుపత్రికి తరలించారు.
ఇరుగుపొరుగు వారి ప్రకారం, విధాయక్ కష్టపడి పనిచేసే వ్యక్తి. కానీ ప్రయత్నాలకు ఫలితం రాకపోవడంతో కొద్ది రోజులుగా అతడు మానసికంగా దిగులుకు లోనయ్యాడని తెలిపారు. బయటివారితో కలిసిమెలిసి ఉండటం తగ్గించి, ఒంటరిగా ఉండటం ప్రారంభించినట్లు వారు చెప్పారు.
ఈ ఘటన సోషల్ మీడియా వ్యసనంపై మరోసారి చర్చకు దారితీసింది.


Tốc độ tải trang nhanh và không bị chặn là ưu điểm lớn nhất của 888slot store . Bạn có thể truy cập mượt mà trên cả điện thoại và máy tính. TONY04-14H
Tính năng bảo mật hai lớp (2FA) tại slot365 đăng nhập giúp tài khoản của quý khách luôn nằm trong tầm kiểm soát an toàn, tránh mọi hành vi xâm nhập trái phép. TONY05-08