ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తోనే మేడారం జాతర అభివృద్ధి -మంత్రి సీతక్క

మేడారం అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ:
ఎస్.ఎస్. తాడ్వాయి మండలం, ములుగు జిల్లా | జనవరి 09, 2026

మేడారం జాతర సమీపిస్తుండడం తో రేయింబవళ్ళు కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి. మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, వివిద ప్రభుత్వ శాఖల అధికారుల నిరంతర పర్య వేక్షణలో గత మూడు నెలలుగా జరుగుతున్న పనులు తుది మెరుగులు దిద్దు కుంటున్నాయి.

శుక్రవారం మంత్రి సీతక్క మేడారంలో మీడియా వారికి ప్రత్యేకంగా జాతర ఏర్పాట్ల పురోగతిని వివరించారు.
వన దేవతల కీర్తిని ప్రపంచానికి తెలియజేయాలని మీడియాకు విజ్ఞప్తి చేసారు.

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు జరుగుతున్నాయని మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.


శుక్రవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రూ.251 కోట్ల నిధులతో మేడారం జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు.
మేడారం ఆలయ పునరుద్ధరణకు గిరిజన పెద్దలు, పూజారులు, ఆదివాసీ సంఘాలతో సమావేశాలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. అందరి సమ్మతితో పనులు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.


ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారని, ఈసారి శాశ్వత అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.

జనవరి 18 రాత్రి మేడారం కు రానున్న సీఎం

గద్దెల పునరుద్ధరణను ఈ నెల 19వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, 18వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. మాట్లాడుతూ జాతర నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, జాతర సమయంలో 30 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించినట్లు చెప్పారు.


జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ మాట్లాడుతూ భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగుతుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా జనసాంద్రతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన