Headlines

మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్


పాలమూరును పసిడి పంటల నిలయంగా చేస్తా
మక్తల్, తెలంగాణ:
మక్తల్‌లో జరిగిన అభూతపూర్వ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పాలమూరు జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “మీ ఆశీర్వాదాలతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చాను” అని అన్నారు.
పాలమూరు ప్రజల నిజాయితీ, ధైర్యసాహసాలను ప్రస్తావిస్తూ, “పాలమూరు ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది… మోసం చేస్తే పాతాళానికి తొక్కుతుంది” అని వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం కెసీఆర్‌పై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, పాలమూరు తమను ఆదరించినా, పది సంవత్సరాల పాలనలో సంగం బండ బండను పగలగొట్టేందుకు రూ.12 కోట్లు కూడా కేటాయించలేదని తెలిపారు. జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తిచేయలేదని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం వచ్చాక పాలమూరు ప్రాజెక్టులపై పని ప్రారంభించడానికి ప్రయత్నిస్తే, కోర్టు కేసులు వేసి ఏడాదిన్నర పాటు అడ్డుకున్నారని తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా ఎకరానికి రూ.20 లక్షలు ఇచ్చి 96% భూసేకరణ పూర్తి చేసినట్టు చెప్పారు. నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించారు.
“మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పాలమూరు నీటిపంటల స్వర్గధామంగా మారాలని నా లక్ష్యం” అని హామీ ఇచ్చారు.
విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత
ప్రతి పేద పిల్లవాడికి నాణ్యమైన విద్య అందాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు, పాలమూరు జిల్లాలో 14 పాఠశాలలు, అలాగే ఐఐటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
సంక్షేమ పథకాలు – ముఖ్యమంత్రి వివరాలు
• ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం
• 200 యూనిట్ల ఉచిత విద్యుత్
• రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ
• రైతు రుణమాఫీ అమలు
• రెండు సంవత్సరాల్లో రైతులకు రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు
• మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు
• కులగణన పూర్తిచేసి బలహీన వర్గాల లెక్కలు
• ఎస్సీ వర్గీకరణ అమలు
మాజీ సీఎం కెసీఆర్ చేసిన ₹8 లక్షల కోట్ల అప్పును చెల్లిస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.
త్వరలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్ 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాష్ట్ర ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నామని చెప్పారు.
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు హితవు
సమీపిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధిని అరికట్టే వారిని కాదు, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే వారిని ఎన్నుకోాలని సీఎం పిలుపునిచ్చారు. “మీ గ్రామాలకు నిధులు, నీళ్లు ఇవ్వడం మా బాధ్యత” అన్నారు.
చివరిగా, రాబోయే పదేళ్లలో పాలమూరును పసిడి పంటల పాలమూరుగా మార్చడం తన సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు