తెలంగాణ పెరిక కుల సంఘ రాష్ట్ర అధ్యక్షలుగా యర్రంశెట్టి ముత్తయ్య

పెరిక కుల (పురగిరి క్షత్రియ) సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యర్రంశెట్టి ముత్తయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ కుతుబుల్లాపూర్ లో బుధ, గురువారం రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సదస్సులో రాష్ట్ర కో ఆర్డినేటర్లు, వివిధ జిల్లాల నుండి వచ్చిన నాయకులు, కుల పెద్దల సమక్షంలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా లక్కర్స్ ప్రభాకర్ వర్మ, అసోసియేట్ అధ్యక్షులుగా ఆక రాధాకృష్ణ, సాగాని హరికృష్ణ లను, ముఖ్య సలహాదారులుగా రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, సీనియర్ నాయకులు చింతం లక్ష్మీనారాయణలను ఎన్నుకున్నారు. 
   రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన యర్రంశెట్టి ముత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పెరిక పెద్దలు ఎంతో నమ్మకంతో నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కుల పెద్దలు సూచించిన విధంగా పెరిక కుల ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శక్తికి మించి కృషి చేస్తానని అన్నారు. పెరిక కుల ప్రజలను సామాజికంగా ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి ప్రభుత్వం, కుల పెద్దల సహకారంతో అమలు చేస్తానని అన్నారు. శ్రమలో, ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే పెరిక కుల ప్రజలు రాజకీయాల్లో కూడా స్వయం కృషితో ఎదుగుతున్నారని, విద్య, ఉద్యోగాల్లో కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని, కుల సంఘం నుండి సహకారం, ప్రోత్చాహం అందిస్తే మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. బి.సి ఉద్యమ శకం నడుస్తున్న నేటి రోజుల్లో పెరిక కుల ప్రజలను బి.సి ఉద్యమాల్లో ప్రత్యేక స్థానం కల్పించే దిశగా ముందుకు సాగుదామని అన్నారు. 
 గతంలో సంఘానికి నాయకత్వం వహించిన వారు ఒంటెద్దు పోకడలతో సంఘాన్ని బ్రస్టు పట్టించారని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడి సంఘాన్ని, కుల ప్రజలను అభివృద్ధిని మరిచారని, ప్రశ్నించిన వారిని పక్కకు నెట్టి ఆధిపత్యంతో సంఘాన్ని, సంఘ ఆస్తులను కైవసం చేసుకొని కుల ప్రజలకు నష్టం చేస్తున్నారని అన్నారు. పెరిక కులం అంటే ఒక్క హైదరాబాద్ లోనే లేదని, ఒక్క హైదరాబాద్ లోనే భవనాలు కట్టడంలో ఆంతర్యం ఏమిటని? హైదరాబాద్ నగరంలో ఉన్న సంపన్న పెరిక కులస్తులు కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంఘాన్ని కైవసం చేసుకున్న విషయం రాష్ట్రంలోని పెరిక కులస్తులు గమణించారని, అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త సంఘాన్ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. కొత్తగా ఎన్నుకోబడిన సంఘం 33 జిల్లాల్లో పెరిక కుల ఆత్మగౌరవ సంఘాలు నిర్మించి అందులో హాస్టళ్లను నిర్వహించి అందులో రాజకీయ, విద్య శిక్షణలు ఇస్తామని అన్నారు.

అప్రజాస్వామిక కమిటి వైదొలగాలి

 రాష్ట్ర, జిల్లా సంఘాలకు ఉన్న ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇటీవల ఎన్నుకోబడిన రాష్ట్ర కమిటి వెంటనే రాజీనామా చేసి వైదొలగాలని కొత్తగా ఎన్నుకోబడిన కమిటి తీర్మానం చేశారని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా నడపాల్సిన కుల సంఘాన్ని రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతున్నారని, గత పార్లమెంటు ఎన్నికల నుండే పెరిక కుల రాష్ట్ర సంఘాన్ని రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టీ వాళ్ల ఇష్టానుతీరుగా ప్రవర్తిస్తూ కులానికి చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడం వల్ల రాష్ట్ర పెరిక కుల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. కుల సంఘంలో ఏనాడు పనిచేయని వారు ఏకంగా పెరిక సంఘం రాష్ట్ర నాయకులుగా ఎన్నుకున్నామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. అప్రజాస్వామికంగా నియమించబడిన కమిటికి రాష్ట్రంలోని కులస్తులు, ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, ఇతర సామాజిక సంఘాలు ఎవరూ గుర్తించకూడదని, సహకరించకూడదని తెలిపారు.
కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు యర్రం శెట్టి ముత్తయ్య, వారి కమిటీకి కుల పెద్దలు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, బొలిశెట్టి రంగారావు, బరుపటి ప్రసాద్, అంకతి ఉమా మహేశ్వర్ రావు, గజ్జెల వెంకన్న,  పూజారి వెంకటేశ్వర్లు, చిడెమ్ మోహన్ రావు, బొలుగొట్టు శ్రీనివాస్, కానిగంటి శ్రీనివాస్, డాక్టర్ కౌలయ్య, బోడకుంట్ల సుధాకర్, గంపా నాగరాజు, ధనేకుల కృష్ణ, నట్టే మోహన్ రావు, అంకతి వెంకటరమణ, దిడ్డి మోహన్ రావు, శ్రీరామ్ వీరయ్య, దిడ్డి నరేందర్, సందెసాని నరేష్, శ్రీధర్ల జగదీష్, అప్పని సతీష్, సైదులు తదితరులు అభినందనలు తెలిపారు.
Share this post

9 thoughts on “తెలంగాణ పెరిక కుల సంఘ రాష్ట్ర అధ్యక్షలుగా యర్రంశెట్టి ముత్తయ్య

  1. Tham gia xn88 bshrf là một quá trình đơn giản, nhanh chóng và bảo mật. Với giao diện được thiết kế tối ưu cho người dùng Việt Nam, việc bắt đầu trải nghiệm nhà cái đổi thưởng trở nên dễ dàng ngay cả với những người mới làm quen với thế giới giải trí trực tuyến.

  2. link 66b Tỷ lệ hoàn tiền có thể dao động từ 5% đến 10% tùy vào sự kiện trò cụ thể. Điều này không chỉ giúp người tham gia giảm bớt áp lực khi thua cược mà còn tạo thêm cơ hội để họ quay lại các trận đấu giành chiến thắng.

  3. link 66b Tỷ lệ hoàn tiền có thể dao động từ 5% đến 10% tùy vào sự kiện trò cụ thể. Điều này không chỉ giúp người tham gia giảm bớt áp lực khi thua cược mà còn tạo thêm cơ hội để họ quay lại các trận đấu giành chiến thắng.

  4. đăng nhập 188v được thành lập vào năm 2015 và hiện đang hoạt động hợp pháp với sự cấp phép từ tổ chức Curacao eGaming, giấy phép số 365/JAZ. Đây là một đơn vị giải trí trực tuyến nổi bật tại châu Á với quy mô hoạt động rộng khắp nhiều quốc gia.

  5. Bạn có thể chơi lô đánh đề từ 1.000+ kỳ quay thưởng đang diễn ra liên tục và hốt tiền cực nhanh chỉ sau 1 giây. trang chủ 66b cung cấp nhiều kiểu cược xổ số khác nhau như: Bao lô, đánh đề, 3D, lô trượt, 4 càng giải Nhất,… đặc biệt là Up/Down, Reverse, Big/Small,… vừa mới “ra lò”.

  6. Sản phẩm xanh chín tiếp theo nhất định không nên bỏ qua khi cùng đăng nhập 66b đăng nhập vào đó chính là xổ số lô đề trực tuyến. Ngoài phiên bản truyền thống quen thuộc, sảnh chơi này còn đưa tới nhiều hình thức mới lạ khác để anh em tha hồ trải nghiệm, có thể kể đến như lô đề, keno, quay số,…..Mỗi tựa game sẽ có cách chơi khác nhau, nhưng đừng lo vì tất cả đều có hướng dẫn chi tiết cho người chơi trước khi chinh phục.

  7. Sản phẩm xanh chín tiếp theo nhất định không nên bỏ qua khi cùng đăng nhập 66b đăng nhập vào đó chính là xổ số lô đề trực tuyến. Ngoài phiên bản truyền thống quen thuộc, sảnh chơi này còn đưa tới nhiều hình thức mới lạ khác để anh em tha hồ trải nghiệm, có thể kể đến như lô đề, keno, quay số,…..Mỗi tựa game sẽ có cách chơi khác nhau, nhưng đừng lo vì tất cả đều có hướng dẫn chi tiết cho người chơi trước khi chinh phục.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన