JEWELS OF ASAF JAHI’S – the Glory of WARANGAL కాఫీటేబుల్ బుక్ ను ఆవిష్కరించిన సి.ఎస్. రామకృష్ణారావు

హైదరాబాద్, నవంబర్ 12 :: సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రచించిన JEWELS OF ASAF JAHI’S – the Glory of WARANGAL * అనే కాఫీ టేబుల్ బుక్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు నేడు ఆవిష్కరించారు. డా. బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక కూడా హాజరయ్యారు. వరంగల్ నగరంలో అస్ఫజాహీల హయాంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వరంగల్ కేంద్రం గా పాలనను చేసిన సుబేదారుల వివరాలు వారి చరిత్రతో కూడిన ఈ కాఫి టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడుతుందని సి.ఎస్ అన్నారు. పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే చారిత్రక అంశాలతో కూడిన ఈ కాఫీ టేబుల్ బుక్ ను వెలువరించడం అభినందనీయమని సి.ఎస్ ప్రశంసించారు.
వరంగల్ అంటే… కాకతీయుల పాలన, వేయిస్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం వెంటనే మదికి వస్తాయి. అయితే, వరంగల్ నగరంలో అడుగు పెట్టగానే కాజిపేట నుండి మామునూర్ వరకు నిజాం నవాబులు నిర్మించిన అద్భుతమైన భవనాలు, కాజిపేట రైల్వే స్టేషన్, ప్రస్తుత మిషన్ భగీరథ పధకమైన ఇంటింటికి తాగునీరందించే ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్ ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు వరంగల్ కేంద్రంగా వరంగల్ సుబాహ్ గా
ఆదిలాబాద్‌, కరీంనగర్, వరంగల్‌, ఖమ్మంలోని కొన్నిప్రాంతాలు ఉండేవి. ఈ వరంగల్ సుబేదారులుగా ఎవరెవరు ఉన్నారు. వారి ప్రత్యేకతలేమిటి, ఈ విషయమై కొన్ని అరుదైన, విశేషాలతోకూడిన సమాచారంతో పాటు నిజాం నిర్మిత హెరిటేజ్ కట్టడాల ఫోటోలతో కలిపి ఈ JEWELS OF ASAF JAHI’S – the Glory of WARANGAL కాఫి టేబుల్ బుక్ ఉంటుంది. ఈ పుస్తకం చరిత్ర అధ్యయన వేత్తలు, విద్యార్థులు, చరిత్రపై ఆసక్తి ఉన్న వారికి ఉపయోగపడుతుంది

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు