వరంగల్, జూలై 31:
కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ (కెఐటీఎస్‌వీ)లో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి. పవన్ కుమార్ చిలప్ప కు పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ), జలంధర్ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ డిగ్రీ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పవన్ కుమార్ “Design of Reduced Switch Count and Fault Resilient Ability of 7-Level Inverter” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనను డా. ఎన్. కార్తిక్ (అసోసియేట్ ప్రొఫెసర్) మరియు డా. ఎ. మధుకర్ రావు (అసిస్టెంట్ ప్రొఫెసర్), ఇద్దరూ కెఐటీఎస్‌వీకి చెందినవారే, వీరి మార్గదర్శకత్వంలో పూర్తి చేశారు.
ఈ పరిశోధనలో పవన్ కుమార్ గారు, తక్కువ స్విచ్‌లతో పనిచేసే మరియు ఫాల్ట్ టోలరెంట్ సామర్థ్యం కలిగిన మల్టీ లెవెల్ ఇన్వర్టర్‌ను అభివృద్ధి చేశారు. ఇది ప్రత్యేకంగా ఆఫ్-గ్రిడ్ గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. విద్యుత్‌లో అంతరాయం కలిగినా, వ్యవస్థ ఆగకుండా పనిచేసే ఈ ఇన్వర్టర్ గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతూ, నూతన మరియు పునర్వినియోగదగిన శక్తుల వినియోగానికి ఉపయోగపడ్తుంది.
ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు, కెఐటీఎస్ ఛైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత్ రావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అభినందనలు తెలియజేశారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వాస్తవ సమస్యలపై చేసుకున్న అధ్యయనం ఎంతో ప్రాశస్త్యమైందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, ఈఈఈ విభాగాధిపతి డా. ఎం. నరసింహారావు, అన్ని డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పిఆర్ ఓ డా. డి. ప్రభాకర చారి హాజరై డా. పవన్ కుమార్ ను అభినందించారు.