ట్రంప్ ఖఠిన నిర్ణయం -భారతీయలకు ఉద్యోగాలివ్వవద్దని ఐ.టి ధిగ్గజ కంపెనీలకు వార్నింగ్

Trump us

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులపై ఖఠిన నిర్ణయం ప్రకటించారు., అమెరికాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలలో భారతీయులను ఉద్యోగాల్లో నియమించవద్దని ధిగ్గజ కంపెనీలకు ఆయన వార్నింగ్ ఇవ్వడం భారతీయులను తీవ్ర ఆందోళన పరిచింది.

మైక్రోసాఫ్ట్‌, గూగుల్ వంటి టెక్ సంస్థ‌ల‌కు భార‌తీయుల‌ను నియ‌మించుకోవ‌ద్దంటూ నేరుగా ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శించారు. చాలామంది అమెరిక‌న్లు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ భావ‌న‌లో ఉన్నార‌ని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ల‌భించిన స్వేచ్ఛ‌ను వాడుకొని చాలా టెక్ సంస్థ‌లు ఇత‌ర దేశాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నాయని, త‌న పాల‌న‌లో ఆ రోజులు ముగిసిపోతాయ‌ని హెచ్చ‌రించారు.

“మ‌న దేశంలోని భారీ టెక్ సంస్థ‌లు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ.. భార‌తీయ ఉద్యోగుల‌ను నియ‌మించుకొంటూ.. ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకుని త‌క్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛ‌ను అనుభ‌వించాయి. ఆ విష‌యం మీకు తెలుసు. అమెరిక‌న్ల అవ‌కాశాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, నిర్ల‌క్ష్యం చేయ‌డం వంటివి జరిగాయి.

ట్రంప్ పాల‌న‌లో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజ‌యం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశ‌భ‌క్తి అవ‌స‌రం. ఇక్క‌డ ఉన్న టెక్ కంపెనీలు అమెరికా కోస‌మే. దేశానికే మొద‌టి ప్రాధాన్యం ఇస్తూ ప‌ని చేయాలి. మీరూ అదే చేయాలి. నేను కోరుకునేది కూడా అదే” అని ట్రంప్ అన్నారు.

ఇప్పటికే H-1B వీసాల విషయంలో ట్రంప్ పాలనలో కఠిన నియమాలు అమలయ్యాయి. వీటి కారణంగా వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు అమెరికాలో స్థిరపడే అవకాశాలు కోల్పోయారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి భారతీయుల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి.

ఒక ప్రచార సమావేశంలో మాట్లాడిన ట్రంప్, “విదేశీయులను కాకుండా, అమెరికా యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇండియాతో సహా ఇతర దేశాల నుండి వచ్చినవారికి ఇక అమెరికాలో అవకాశాలు ఉండవు,” అని వ్యాఖ్యానించారు. హోమ్‌గ్రోన్న్ ఉద్యోగ విధానాన్ని కొనసాగిస్తామని ట్రంప్ మొదటినుండి అదే అభిప్రాయంతో ఉన్నారు.

Share this post

One thought on “ట్రంప్ ఖఠిన నిర్ణయం -భారతీయలకు ఉద్యోగాలివ్వవద్దని ఐ.టి ధిగ్గజ కంపెనీలకు వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో