కోబ్రా..ఈ మల్హోత్రా..!
ఒక యూ ట్యూబర్..
అత్యంత పటిష్టమైన భారత రక్షణ వ్యవస్థకు చెందిన రహస్య సమాచారాన్ని
పాకిస్తాన్ కు చేరవేయడమా..
నమ్మశక్యం కాదన్నట్టు ఉన్నా..
ఇందులో ఉన్నది నిజమే..
ఈ నిజం వెనకాల ఉన్న
లోటుపాట్లను.. గుట్టుమట్లను
వెలికితీసే పనిలో అధికారులు
ఉన్నారట..
ఇది చిన్న విషయమేమీ కాదు..
భారత రక్షణ వ్యవస్థలోని రహస్యాలను మన దేశంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు
శతృ దేశాలకు చేరవేస్తున్నట్టు
సినిమాల్లో చూపిస్తే అరె..సినిమా వాళ్ళు ఇలా తీసేస్తారు గాని..నిజంగా
జరిగేదా..మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది..
అసాధ్యం అనుకుంటాం కదా.
మన కళ్ళెదుట ఇది జరిగింది..
ఒక మహిళ..
అదీ యూ ట్యూబర్..
జ్యోతి మల్హోత్రా..
ఇంత దుస్సాహసానికి పాల్పడడం..
అది పెహల్గాం వంటి దుస్సంఘటనకు దారి తీయడం మన దేశ చరిత్రలో
ఒక మాయని మచ్చ..
అంతేనా మన రక్షణ..భద్రతా వ్యవస్థల ఘోర వైఫల్యం..
సదరు మల్హోత్రా సినిమాకి వెళ్లి
వచ్చినంత సులువుగా.. సౌకర్యంగా పాకిస్తాన్ వెళ్లి వచ్చేస్తుంటే..అక్కడ ఆమెకు
ఎర్ర తివాచీ స్వాగతం..
ఘనమైన అతిధి మర్యాదలు
జరుగుతుంటే మన వ్యవస్థలకు ఇంత మాత్రమైనా అనుమానం రాకపోవడం..
కనీస సమాచారం లేకపోవడం
అతి దారుణం..
ఇదేదో ఇప్పుడు మొదలైన కథ కాదు..ఇప్పటికే జ్యోతి మల్హోత్రా పలుమార్లు
పాకిస్తాన్ వెళ్లి వచ్చింది
పాకిస్తాన్ పర్యటనల పర్యవసానంగా ఆమెకు
పొరుగు దేశం ప్రభుత్వంలోని కొందరు పెద్ద వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
మొదటిసారి వీసా రావడానికి
ఆమె ఒక సంస్థను వాడుకున్నా..ఒకసారి వెళ్ళినాక ఆమెకు మార్గాలు సుగమం అయిపోయాయి.
ప్రయాణ ఏర్పాట్లు చకచక జరిగిపోయేవి..
పాకిస్తాన్ జ్యోతి మల్హోత్రాను
తన ప్రధాన ఆయుధాల్లో ఒకటిగా చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఆమెకు గల సోషల్ మీడియా నెట్ వర్క్ ను వాడుకునే వ్యూహాలను సిద్ధం చేసుకుని
అందుకు తగినట్టుగా పావులు
కదిపింది..ఇంకా లోతుకు వెళ్తే
ఎన్ని వివరాలు బయటకు వస్తాయో..
ఇవన్నీ తేలే ముందు..
ఇక్కడ దేశీయంగా జ్యోతి మల్హోత్రాకి సహకరిస్తున్న వారు ఎవరు..వారు ఏ విభాగంలో ఎంతటి స్థాయిలో ఉన్నారన్నది
గట్టిగా ఆరా తీయాల్సి ఉంది..
మల్హోత్రా పాకిస్తాన్లో ఎంత
పెద్ద పెద్ద వ్యక్తులతో
పరిచయాలు ఏర్పరచుకుని ఉందో..ఆ వివరాలు మన పరిశోధన అధికారులకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
పాకిస్తాన్లో ఒక ముఖ్యమైన
ఇఫ్తార్ విందుకు ఆమెకు
ప్రత్యేక ఆహ్వానం అందడం..
ఆమె వెళ్లడం విస్మయం కలిగించే విషయాలు.
పొరుగు దేశంలోనే ఇంత పెద్ద స్థాయిలో సంబంధాలు ఏర్పరచుకున్న మల్హోత్రాకి
మన దేశంలో పరిచయాలు
ఏర్పరచుకోవడం ఏమంత కష్టమైన వ్యవహారం కాబోదు..అందునా
ఆమె యూ ట్యూబ్ లో
3.85 లక్షల మంది వీక్షకులున్న
ఆధునిక “సెలబ్రిటీ..”!
ఇప్పుడు ఆమె మాత్రమే కాదు
హర్యానాలో ఇంకొందరు కూడా అదుపులో ఉన్నారు.ఇంకా మల్హోత్రా దేశీయంగా ఎంత మందిని తన లైన్లోకి తెచ్చుకుందో..వారు ఎవరు..
ఏ స్థానంలో ఉన్నారు..
తవ్విన కొద్దీ వెలికి వచ్చే నిజాలు..ఎలా ఉంటాయో మరి..!?!?
కొసమెరుపు..
జ్యోతి మల్హోత్రా చైనా కూడా
సందర్శించి వచ్చిందట..
ఈఎస్కే..జర్నలిస్ట్..


I really like what you guys tend to be up too. This sort of clever work and reporting! Keep up the good works guys I’ve incorporated you guys to my own blogroll.