టాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రేక్షకాధరణ పొందిన హీరోలలో అగ్రగణ్యుడు ఎన్టీఆర్.ఆతర్వాత ఏఎన్ఆర్. ఇకమూడోవ్యక్తి నటశేఖర కృష్ణ. వీరుముగ్గురూ ముగ్గురేత్రి మూర్తులుగా టాలీవుడ్ రంగాన్ని ఏలి ఆడిపాడి అలరించారు.
అయితే నటనలో ఎవరు అత్యధికంగా ప్రేక్షకుల అభిమానాన్ని మూటగట్టుకున్నారంటే ఎవరికి వారే వారివారి ఒదిగిపోయే పాత్రల్లో తెలుగు సినిమారంగంలో ముద్ర పడిపోయారు.

ఆకోవలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా,శ్రీరాముడిగా అచ్చుదివి నుండి భువికి దిగి వచ్చినట్లు ఆదరణ పొందాడు. అట్లాగే ఎఎన్ఆర్ అటు భక్తిరసాల్లోను ఇటు ప్రేమ రసాల్లోను తనకు ఎవరూ సాటిరారని అనిపించుకున్నారు.
ఇకకృష్ణ విషయానికివస్తే ఆయనస్టైలే సెపరేటు. హాలీవుడ్ సినిమాల్లో ఉన్న జేమ్స్ బాండ్ ట్రెండ్ ను టాలీవుడ్ లో ఆవిష్కరించాడు.
ఈ ముగ్గురూ తెలుగునాట సినిమా రంగాన్ని దశాబ్దాల తరబడి ఏలిన వారు.
మద్రాస్ రాష్ర్టం నుండి ముగ్గురూ స్వరాష్ట్రానికి తరలి వచ్చి స్వంతంగా స్టూడియోలు నిర్మించుకుని సినిమారంగం వైభవానికి పునాదులు వేశారు. ఈవిషయంలో తొందులుత ఎఎన్ఆర్ పేరే చెబుతుంటారు. తన సతీమని అన్నపూర్ణ పేరిట స్టూడియో నిర్మించిని తొందొలుత హీరోగా అక్కినేని నిలిచారు.

ఆతర్వాత ఎన్టీఆర్,కృష్ణ అదే వరుసలో స్టూడియోలు నిర్మించి కళామతల్లిని తరించారు.
ఈ ముగ్గురు హీరోలలో ఎవరి ప్రత్యేకతలు వారికున్నా ఓవిషయంలో మాత్రం నట శేఖర కృష్ణ రికార్డులను అధిగమించ లేక పోయారు.
ఎక్కువ సినిమాలలో నటించిన ఘనత నటశేఖర కృష్ణ కే లభించింది. అందుకే ఆయన సూపర్ స్టార్ గా నిలిచిపోయారు.
- ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా మేడారం -మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- తల్లుల రాకతో పులకించిన మేడారం
- జాతరలో హిజ్రాల హల్ చల్
- సమ్మక్క తల్లి ఆగమనం
- మామునూరు ఎయిర్‌పోర్టుకు భూముల అప్పంచిన ప్రభుత్వం

హీరోగా అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా సూపర్ స్టార్ కృష్ణ అగ్రస్థానంలో నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డులకెక్కిన ఈ ఘనత ఇప్పటికీ ఎవరికీ అందని ఎత్తులో ఉంది.
కృష్ణ దాదాపు 350కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. 1960ల నుంచి 1990ల వరకు వరుస విజయాలతో ప్రేక్షకులను ఉర్రూత లూగించారు. యాక్షన్, కుటుంబ కథాచిత్రాలు, ప్రయోగాత్మక సినిమాలతో టాలీవుడ్ దిశను మార్చిన నటుడిగా కృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

రెండో స్థానం: ఎన్టీఆర్
హీరోగా అత్యధిక సినిమాల్లో నటించిన వారిలో రెండో స్థానంలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ ఉన్నారు.
ఎన్టీఆర్ దాదాపు 300కు పైగా సినిమాల్లో హీరోగా నటించారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఆయనకు సాటిలేని పేరు ఉంది. శ్రీకృష్ణుడు, రాముడు వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు.
మూడో స్థానం: ఏఎన్నార్
మూడో స్థానంలో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) నిలిచారు.
ఏఎన్నార్ సుమారు 250కి పైగా సినిమాల్లో హీరోగా* నటించారు. ప్రేమకథలు, సామాజిక చిత్రాలు, భక్తి రస చిత్రాల్లో ఆయన నటన ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. నటనలో సహజత్వానికి ఏఎన్నార్ చిరునామాగా నిలిచారు.
టాలీవుడ్‌కు గర్వకారణం
ఈ ముగ్గురు దిగ్గజాలు టాలీవుడ్‌ను దేశదేశాలలో గుర్తింపు తెచ్చిన మహానుభావులు. హీరోగా అత్యధిక చిత్రాల్లో నటించి, తరతరాల ప్రేక్షకులను ప్రభావితం చేసిన నటులుగా తెలుగు సినిమా చరిత్రలో వీరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి.


