పార్టీల కతీతంగా తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి ఐక్యంగా కృషి జరగాలి …1969 ఉద్యమ కారుడు పులి సారంగపాణి

PULI

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పార్టీల కతీతంగా బుద్ది జీవులు, మేధావులు,విద్యావేత్తలు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా కృషిచేయాలని 1969 తెలంగాణ ఉద్యమ కారుడు రిటైర్డ్ కాలేజి టీచర్స్ అసోసియేషన్ అద్యక్షులు పులి సారంగపాణి పిలుపు నిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర అవసతరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని రిటైర్డ్ కాలేజి టీచర్స్ అసోసియేషన్ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు.
అన్తరం పులిసారంగ పాణి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేందుకు సకల జనులు ఒక్కతాటిపై చివరి వరకు నిలిచారని అన్నారు.1969 ఉద్యమం స్పూర్తితో ఆనాటి అనుభవాలే పునాదులుగా రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అదే ఉద్యమ స్పూర్తి కొనసాగించాలని అన్నారు.
తొలి,మలి విడత ఉద్యమాలలో ఐక్యంగా నిలిచినట్లే అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర అభివృద్ది విషయంలో భేదాభిప్రాయాలకు తావులేకుండా నిలవాలని అన్నారు. సీమాంధ్ర పాలకుల అధిపత్య ధోరణికి వ్యతిరేకంగా దశాబ్దాల తరబడి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగాయని భవిష్యత్ తరాల ప్రయోజనాలకోసం రాష్టాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాల్సిన బాద్యత అందరిపైనా ఉందని అన్నారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు బి.వెంకటేశ్వర్ రావు,ప్రభాకర్ రెడ్డి, ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి, రామలక్ష్మితోపాటు పలువురు రిటైర్డ్ అధ్యాపకులు పాల్గొన్నారు.

Share this post

2 thoughts on “పార్టీల కతీతంగా తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి ఐక్యంగా కృషి జరగాలి …1969 ఉద్యమ కారుడు పులి సారంగపాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం