సమ్మక్క సారలమ్మ నూతన ఆలయ నిర్మాణం ఆదివాసీల చరిత్ర పై మంత్రుల పుస్తక పుస్తక ఆవిష్కరణ
చరిత్ర కు జీవం పోసిన సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం గద్దెల ప్రాంగణంలో తూర్పు ఈశాన్యంలో ఉన్న సమ్మక్క తల్లి ప్రధాన ద్వారం దగ్గర మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరావు, అదేవిధంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్. టి.ఎస్. జిల్లా SP సుదీర్ రామ్ నాథ్ కేకన్ లతో పాటు సమ్మక్క సారలమ్మ పూజారులు జిల్లా రాష్ట్ర అధికారులు, మేడారం నూతన గదేల అభివృద్ధి ప్రణాళిక దానిలో నిర్మించిన 7వేల బొమ్మలకు అర్ధాలను సమ్మక్క సారలమ్మ పరిశోధన బృందం వారు రచించిన ఆదివాసీల చరిత్ర గ్రంథాన్ని విడుదల చేసారు.
ఈ పుస్తకం లో పూర్తిగా నూతన గద్దెల అభివృద్ధి ప్రభుత్వ మాస్టర్ ప్రణాళిక ల్యాండ్ స్కెప్ ల నిర్మాణం ఆలయం లో ఉన్న 9 ద్వారాలు, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపై ఉన్న నాగులమ్మ ఆలయంపై బొమ్మలతో పాటు 70 ప్యానెల్స్ పై ఉన్న మొత్తం 7000 బొమ్మల అర్ధాలను సంపూర్ణంగా అర్థాలు ఇవ్వటం జరిగింది
దీనితో పాటు కోయల పూర్వ చరిత్ర మధ్య భారత దేశం లో ఆదివాసీల జీవన విధానం వివరాలు సైతం శాస్త్రీయంగా లిఖించినారు ఈ పుస్తకం పూర్తిగా రీసెర్చ్ డాక్యుమెంటేషన్ రూపం లో చాలా శాస్త్రీయ ఆధారాలతో వ్రాసినట్టు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ డా.అరుణ్ కుమార్ తెలిపారు.
ఎంతో కష్ట పడి ఆలయ నిర్మాణం లో నిరంతరం బాగా స్వామ్యం అవటమే గాక
ఈ పుస్తక రచన కు కృషి చేసిన అరుణ్ ని మంత్రులు ప్రత్యేకంగా అబినదించారు.
ఈ పుస్తక విడుదలకు ఆదివాసీ చరిత్ర నిర్మాణానికి అన్ని రకాలుగా మొదటి నుండి సహకరించిన జిల్లా కలెక్టర్ ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి కి పరిశోధన బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Thanks for another great post. Where else could anyone get that kind of info in such an ideal way of writing? I’ve a presentation next week, and I’m on the look for such info.