తెలంగాణలో జిల్లా కలెక్టర్ల పనితీరు ప్రశ్నర్దాకంగా మారింది. పనులు కావడం లేదని ప్రజలు పని తీరు బాగా లేదని మరో వైపు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.
అధికార పక్షం నిఘా నేత్రం లో జిల్లా కలెక్టర్ల పని తీరు కత్తి మీద సాములాగా మారింది. బదిలీల మీద బదిలీలు ఐఏఎస్ లను కుదిపేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 2022లో 10 జిల్లాల నుంచి 33కి జిల్లాల సంఖ్యను పెంచిన తర్వాత, యంగ్ IAS అధికారులకు జిల్లా కలెక్టర్లుగా పనిచేసే అవకాశాలు విస్తరించాయి. ఈ మార్పు ప్రజల సమస్యల త్వరిత పరిష్కారానికి ఎంతవరకు ఉపయోగపడింది? కలెక్టర్ల పనితీరుపై ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
ప్రభుత్వం తరచూ పనితీరు సమీక్షలు (analysis) నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లా పరిపాలనపై రాజకీయ ప్రభావం పెరిగిందనే అభిప్రాయం నెలకొంది.
ఒకప్పుడు అధికారులు స్వతంత్ర నిర్ణయాలతో, నిష్పక్షపాతంగా పనిచేసేవారు కాని బలాడ్యు లైన ప్రజా ప్రతి నిధులున్న చోట కలెక్టర్లను నయనా భయనా లొంగ దీసుకునే ప్రయత్నాలు జరిగేవి. వినని కలెక్టర్లకు తిప్పలు తప్పేవి కాదు.
ఇప్పటికి ఆ పరిస్థితులు మారలేదు.
తెలంగాణ రాష్ట్రం లో కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత కూడా పరిపాలనా వ్యవస్థలో మార్పులు పూర్తిగా కనిపించడం లేదని ప్రజలు కలెక్టర్ల పై విసుక్కుంటుంటే మరో వైపు ప్రభుత్వం వారినో స్టేనోలుగా మార్చిందనే విమర్శ లున్నాయి.
కొత్త జిల్లాలు వచ్చినా ఫైల్లు వేగంగా కదలడం లేదని, లంచం సమస్య పూర్తిగా తగ్గలేదని కొందరు ఆరోపిస్తున్నారు.
తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారులు మీటింగుల్లో ఉన్నారని, లేదా మంత్రుల కార్యక్రమాల్లో ఉన్నారని, చెబుతున్నారని ప్రజలు అంటున్నారు.
ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ సెల్‌కు రావాలని సూచిస్తారని చెబుతున్నారు. అక్కడికి వెళ్లినా తహసీల్దార్‌లను (Tahsildars) కలవాలని చెప్పి పంపుతున్నారని, సమస్యలు పరిష్కారం కావడం లేదని కొందరు నిట్టూర్పు విడుస్తున్నారు.
మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు జరిగినా అవి కొన్నిసార్లు పరిపాలనలో స్పష్టమైన మార్పుకు దారి తీస్తున్నాయా అనే ప్రశ్న కూడా ప్రజల్లో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత ప్రజలకు ఏమి లాభం కలిగిందనే ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే అన్ని జిల్లాల్లో పరిస్థితి ఒకేలా లేదని అధికారులు చెబుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో యంగ్ ఐఏఎస్ అధికారులకు తక్కువ కాలంలోనే కలెక్టర్ అయ్యే అవకాశం లభించింది. సాధారణంగా ఒక ఐఏఎస్ అధికారికి కలెక్టర్ పదవి రావడానికి 10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది. కానీ తెలంగాణలో కొందరు అధికారులు రెండు మూడు సంవత్సరాల్లోనే కలెక్టర్లుగా నియమితులయ్యారు.
పబ్లిక్ సర్వీస్‌లో నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. అయితే రాజకీయ జోక్యం పెరగడం వల్ల కొంతమంది అధికారులు పరిమితుల్లోనే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ (Diwakar T.S.) గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. పక్కా భవనాలు నిర్మించడం సాధ్యం కాని గిరిజన గూడాల్లో తక్షణ అవసరాల కోసం కంటైనర్ హాస్పిటల్స్ (Container Hospitals), కంటైనర్ స్కూల్స్ (Container Schools) ఏర్పాటు చేయించారు.
పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లాలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఇతర శాఖల అధికారులతో కలిసి పలు కార్యక్రమాలు అమలు చేశారు. ఇటీవల జరిగిన మేడారం జాతర (Medaram Jatara) అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి జాతర నిర్వహణకు సహకరించారు.
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సహా పలువురు మంత్రులు ప్రశంసించినట్లు సమాచారం. ఒక మంత్రి ఆయనను తమ జిల్లాకు బదిలీ చేయాలని ప్రయత్నించినప్పుడు మంత్రి సీతక్క (Seethakka) అడ్డుకున్నారనే చర్చ కూడా జరిగింది.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాస్ IAS ముఖ్యంగా ప్రస్తావించదగిన వ్యక్తి. జిల్లా స్థాయిలో డేటా ఆధారిత నిర్ణయాల తో ప్రజల మెప్పు సాధించారు.
ప్రజలకు విసుగులేకుండా పదే పదే ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం కలగ కుండా సౌకర్యవంతంగా పాలన కొనసాగేందుకు ఐఏఎస్ లు మార్గం సుగమమ్ చేయాలి.
హరి చందన దాస్ 2025 అక్టోబర్‌లో హైదరాబాద్ జిల్లా లో ప్రవేశపెట్టిన QR కోడ్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ఒక ఇందుకొక ఉదాహరణ. దీని ద్వారా ప్రజలు సిబ్బంది విధేయత, సమస్యల పరిష్కార వేగం మీద రియల్‌టైమ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వొచ్చు.
ఇది ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచుతోందని అధికారులు చెబుతున్నారు.
సమస్యలు వేగవంతంగా పరిష్కారానికి నోచుకోవాలి.
మహిళా ఐఏఎస్ అధికారులు తమ పనితీరుతో గుర్తింపు పొందారు.
కరీంనగర్ నగర్ కలెక్టర్‌గా పనిచేసిన పమేలా సత్పతి (Pamela Satpathy) తక్కువ కాలం పని చేసినా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేశారు. అయితే కొద్ది కాలానికే ఆమె బదిలీ కావడం పై కొందరు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం కూడా ఈ బదిలీకి కారణమై ఉండొచ్చనే చర్చ జరిగింది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారుల పనితీరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పెద్దల మాటలకు అర్దాలే వేరన్నట్లు మీరు చెప్పినట్లు వినక పోతే లూప్ లైన్లో ఉంటారని చెప్పకనే చెప్పినట్లన్న మాట.
అధికార పక్షం రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లపై వత్తిడి పెంచేలా సమీక్ష లంటున్నాయని విమర్శలు వచ్చాయి.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు ఫ్రీక్వెంట్ ట్రాన్స్‌ఫర్లు ప్రభుత్వ పాలనకు అడ్డంకిగా మారాయని ఆరోపించారు.
2026 ఫిబ్రవరిలో 140 IAS అధికారులు, 20 మంది కలెక్టర్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇది పనితీరును ప్రభావితం చేసిందని , ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకుండా పోయాయాని అన్నారు.
2025 మేలో నిర్వహించిన పనితీరు మూల్యాంకనంలో చాలా మంది కలెక్టర్లు 50-55 శాతం మార్కులు మాత్రమే సాధించారని నివేదికలున్నాయి.
రాష్ట్రంలో ఐఏఎస్ ల కొరత మరోవైపు పెద్ద సమస్యగా ఉంది.
రాష్ట్రంలో 66 మంది ఐఏఎస్ లు అవసరం అయినా ఇప్పటికీ పూర్తి సంఖ్య లో కేంద్రం కేటాయించలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి చివరలో జరిగే కలెక్టర్ల సమావేశంలో పనితీరును మరో సారి సమీక్షిస్తారు. ఫీల్డ్ విజిట్లు, సమస్యల పరిష్కార మీద దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో ఐఏఎస్ ల కొరతను పరిష్కరించడం, ట్రాన్స్‌ఫర్లను తగ్గించడం మాత్రమే కాకుండా, ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలను విస్తరించడం అవసరమనే డిమాండ్ బలపడుతోంది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా కలెక్టర్లకు పూర్తి స్వతంత్ర నిర్ణయాధికారం తగ్గిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయ సూచనలను పాటించకపోతే అనుకూలం కాని పోస్టింగులకు బదిలీ అవుతామనే భయం కొందరు అధికారుల్లో ఉందని కూడా చెబుతున్నారు.


**prostafense**
ProstAfense is a premium, doctor-crafted supplement formulated to maintain optimal prostate function, enhance urinary performance, and support overall male wellness.
**neurosharp**
Neuro Sharp is a modern brain-support supplement created to help you think clearly, stay focused, and feel mentally confident throughout the day.
Hey! Someone in my Facebook group shared this website with us so I came to take a look. I’m definitely loving the information. I’m book-marking and will be tweeting this to my followers! Excellent blog and brilliant style and design.