వీరన్న వర్ధంతిలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో స్వాతంత్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా మెజార్టీ ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉన్నారని, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా సాధించాలంటే బహుజన రాజ్యములోనే సాధ్యమని కామ్రేడ్ మారోజు వీరన్న స్పూర్తితో దళిత బహుజనులు ఐక్యతగా రాజకీయ చైతన్యం చెంది బహుజన రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో శుక్రవారం జరిగిన మారోజు వీరన్న 26 వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని వీరన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. కుల వర్గ నిర్మూలన జమిలి పోరాట యోధుడు, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు కామ్రేడ్ మారోజు వీరన్న స్పూర్తి నేటి బహుజన ఉద్యమాలకు చాలా అవసరమని బ్రాహ్మణీయ భావజాలంతో వేల కులాలుగా విడగొట్టబడిన దళిత, ఆదివాసీ, బహుజన కులాలు ఎంతో దోపిడీకి గురవుతున్నారని, శత్రువు ఎవరో మిత్రువు ఎవరో తెలియని బానిసత్వంలో బహుజన సమాజముందని, నిత్యం శ్రమలో, ఉత్పత్తిలో జీవనం కొనసాగిస్తున్న బహుజన శక్తిని రాజకీయ శక్తిగా మార్చాల్సిన అవసరముందని, బహుజన సమాజం నుండి ఎదిగిన వారు మిగతా సమాజ అభివృద్ధికి కృషి చేసిన నాడే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్, ఎంసిపిఐయు హనుమకొండ జిల్లా కార్యదర్శి హంసరెడ్డి, బి.సి హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి నేదునూరి రాజమౌళి, బి.సి మేధావుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అద్యక్షులు కొంగ వీరాస్వామి మాట్లాడుతూ ఉదార స్వభావ రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన బిజెపి ఉగ్రవాద రాజకీయాలను చేస్తుందని, మెజార్టీ ప్రజలైన బహుజన సమాజాన్ని విడదీసి ఆదివాసులు, దళితులపై దాడులు చేస్తూ, చంపుతూ హింసా రాజకీయాలకు తెగబడిందని, బి.సి ప్రజల శ్రమను దోచుకొని అణచివేస్తున్నారని అన్నారు. ఇండియాలో ఏమి చేయాలి, ఎలాంటి ఉద్యమాలు చేయాలో 27 ఏండ్ల క్రితమే సూత్రీకరించారని, కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపి ప్రజలు స్వీకరించే ఉద్యమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. గత 70 ఏండ్లుగా దేశాన్ని పాలించిన పాలకులు ప్రజల అభివృధి కోసం పాలన చేయలేదని, నిత్యం ప్రజలను దోపిడీ చేసే ప్రజా వ్యతిరేక పార్టీలుగానే ఉన్నాయని అన్నారు. ప్రగతిశీల శక్తులు, బహుజన వాదులు ఏకమై ప్రజా పాలన దిశగా అడుగుకు వేసి, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ లు కలలుకన్న బహుజన రాజ్య స్థాపన చేయాలని అన్నారు. జనగణన లో కుల గణన పై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, కులగణన చేసి చేతులు దులుపుకుంటే బహుజన సమాజం ఊరుకోదని, చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి వేల ఏండ్లుగా దోపిడీకి గురైన అణగారిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధికి ప్రణాళికలు రచించి అమలు పరచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జాక్ చైర్మన్ తాడిశెట్టి క్రాంతి కుమార్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు నున్న అప్పారావు, టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, ఎ ఐ ఎఫ్ డి వై రాష్ట్ర అధ్యక్షులు కర్ర రాజిరెడ్డి, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గాడ్గే, ఎంసిపిఐ నాయకులు చీపురు ఓదయ్య, ఐతం నగేష్, న్యాయవాది అనిల్, వివిధ సంఘాల నాయకులు రాసమల్ల లక్ష్మణ్, పెండెల సంపత్, జంగిలి శ్రీనివాస్, పెండ్లి అశోక్ బాబు, పి వెంకటాచారి, ఎన్ రవికుమార్, రాచమల్ల శ్రీనివాస్, బానోత్ సునీల్ నాయక్, నారాయణగిరి రాజు, బిరుదురాజు శ్రీధర్ రాజు, ఫరీద తదితరులు పాల్గొన్నారు.


My developer is trying to persuade me to move to .net from PHP. I have always disliked the idea because of the expenses. But he’s tryiong none the less. I’ve been using WordPress on several websites for about a year and am anxious about switching to another platform. I have heard good things about blogengine.net. Is there a way I can import all my wordpress posts into it? Any help would be greatly appreciated!
My partner and I stumbled over here coming from a different website and thought I might check things out. I like what I see so i am just following you. Look forward to looking over your web page yet again.