Headlines

ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ -2029 ఎన్నికల్లో 117 సీట్లు

revanth reddy

జిల్లా చింతకాని మండలం మత్కెపల్లిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‍పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీకి 2028 డిసెంబర్‍లో ఎన్నికలు జరగవని 2009 జూన్ లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, అల్లుడు, కూతురు, భజన పరులు, ఒప్పంద పరులు, దొంగ సర్వేలు చేసే ఏజెన్సీలు సహా అందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోకోండి.. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లు 25, అసెంబ్లీ 182కు పెరుగుతాయన్నారు. 182 సీట్లలో 117 సీట్లు గెలిచి రెండో సారి ప్రజాపాలన రాబోతోందన్నారు. భద్రాచలం రాముడి మీద ఆన.. ఇది కాంగ్రెస్ కార్యకర్తల మాట.. ఇది రాసి పెట్టుకో కేసీఆర్ అని శపథం చేశారు. కేంద్రంలోని బీజేపీ తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రతిపక్షాలను చీల్చుతోందని దుయ్యబట్టారు.
బీజేపీతో టచ్ లో ఉన్న హరీశ్ రావు
బీజేపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారో లేదో హరీశ్‍రావు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నేను బీజేపీలోకి వెళ్లబోనని వారితో బీజేపీతో మంతనాలు జరపడం లేదని హరీశ్ రావు భద్రాచలం రాముడు, కేసీఆర్‍పై ఒట్టేసి చెప్పాలన్నారు. కాంగ్రెస్ సొంత సర్వేలో బీఆర్ఎస్ గెలవబోతోందని ఫలితం వచ్చిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఫైర్ అయ్యారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఇలాగే సర్వేల పేరుతో డబ్బా కొట్టుకున్నారు. కానీ ప్రజల తీర్పు మాకు అనుకూలంగా ఇచ్చారని, ఇప్పుడు మేము జరిపించిన సర్వేలో మాకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఉంటాయో? ఏ రిజర్వేషన్లు ఉంటాయో తెలియకుండానే ఎవరైనా సర్వేలు చేయిస్తారా అని ప్రశ్నించారు.మీ రాజకీయాల కోసం గ్రామాలు మునగాలా?:
కన్నెపల్లి పంప్ హౌస్‍లు ఓపెన్ చేయాలని బీఆర్ఎస్ నేతల మాటలపై సీఎం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కన్నెపల్లి పంప్‍లు ఆన్ చేస్తే భద్రాచలం రాముడి గుడి సహా 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని మీ లుచ్చా రాజకీయాల కోసం భద్రాచలం రాముడు, గ్రామాలు మునగాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో ఒకరంటే మరొకరికి పడదని ధ్వజమెత్తారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని దుర్మార్గులు విష ప్రచారం చేశారు. ఇవాళ నేను కల్వకుంట్లోళ్లను అడుగుతున్న ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట ఎప్పుడైనా కరెంట్ వైర్‍ను పట్టుకో కాకిలా మాడి మసి అయిపోతారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ రైట్ అన్నారు.

రాజకీయంగా పాలమూరు జిల్లా నాకు ప్రాణం అయితే నా రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా గుండెకాయలా పని చేసిందని సీఎం చెప్పారు. తెలంగాణలో గత పదేళ్లు రాక్షస పాలన సాగిందన్నారు. 2023 జులైలో ఒక అద్భుతం జరిగిందని బీఆర్ఎస్‍ను కాదని పొంగులేటి కాంగ్రెస్‍లో చేరారన్నారు. ఆనాడు ఉప్పెనలా జనం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కానీ బీఆర్ఎస్ డబ్బు మూడలను తట్టుకుని మీరు ఆ ఎన్నికల్లో గెలవలేరని నాతో మీడియా ప్రతినిధులు అన్నారు. కానీ 65 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాం గెలిచి చూపించామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‍కు గుండుసున్నా వస్తుందని చెప్పాం అదే జరిగిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 2/3 మున్సిపాలిటీల్లో 80 శాతం గెలిచాం. మళ్లీ ఖమ్మంలో బీఆర్ఎస్ విషపు మొక్కను మొలకెత్తనివ్వం అని చాటి చెప్పేందుకు చీమలదండై, ఉప్పెనలా వచ్చిన ప్రజలను చూసి నా గుండె పులకరించిపోయిందన్నారు.
ప్రజాప్రభుత్వంలో రామరాజ్యం తీసుకువస్తామని సీఎం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వం అన్నారు. నాడు వరి వేస్తే ఊరి అని కేసీఆర్ అంటే ఇవాళ మా ప్రభుత్వం వరి వేస్తే బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులను రాజును చేయాలనే ఉద్దేశంతో రైతుభరోసా నిధులు విడుదల చేశామన్నారు. 9 రోజుల్లో చివరి విడత డబ్బులు రైతు ఖాతాలో వేశామన్నారు. ఈ 30 నెలల్లో రైతుల కోసం వివిధ కార్యక్రమాల కోసం 1 లక్ష 70 వేల కోట్లు ఖర్చు పెట్టామని ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం మన దేశంలో మరే రాష్ట్రంలో చేయలేన్నారు.

Share this post
IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం