అంతర్వాహిని సరస్వతి పుష్కరాలతో కాంతుళీను తున్న కాళేశ్వరం

సరికొత్త కాంతులీనుతోంది. కనీవిని ఎరగని స్థాయిలో భక్త జనం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శతాబ్దాలుగా సరస్వతి నదికి పుష్కరాలు
జరుపుకునే
ఆనవాయితీ
కొనసాగుతున్నా అధికారికంగా మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఘనంగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్తరాదిన ఉన్న ప్రయాగరాజ్ వద్ద మాత్రమే పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయాన్ని రాష్ట్ర. ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో మొదలుపెట్టింది. దీంతో దేశంలో రెండో చోట సరస్వతి నది పుష్కరాలు నిర్వహించుకునే సాంప్రాదాయానికి కాళేశ్వరం త్రివేణి సంగమంలో శ్రీకారం చుట్టారు.

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పవిత్ర స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పుష్కరాల గురించి విస్తృతంగా ప్రచారం జరగడంతో రోజు రోజుకు భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమ తీరం అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. వేకువ జాము నుండి మొదలు రాత్రి వరకూ కూడా నదీ తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఓ వైపున కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలు, మరో వైపున త్రివేణి సంగమానికి చీరె, సారె సమర్పించడం, నీటి పక్కన సైకత లింగాలకు పూజలు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో కాళేశ్వరం అంతా ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడుతోంది. నది తీరంలో పూర్వీకులను స్మరించుకుంటూ పితృ తర్పణాలు చేసేందుకు భక్తులు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా తమ కుంటుంబ సభ్యులు చనిపోయిన రోజున అమశ్రాద్ధం నిర్వహించే తంతు కొనసాగిస్తుంటారు, కానీ పుష్కర నది తీరంలో తీర్థవిధి నిర్వహించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది భారతీయ సాంప్రాదాయం. ఏటా తమ కుటుంబ సభ్యులకు తిథి కార్యం చేసినప్పుడు మూడు తరాలను తమ గోత్రీకులతో పాటు, చనిపోయిన బంధువులు, స్నేహితులను కూడా స్మరిస్తూ వారి పేరిట పిండ ప్రధానం చేయడం అత్యంత శ్రేయస్కరంగా భావిస్తుంటారు. ఇలాంటి ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి, సాంప్రాదాయలను పాటించేందుకు త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. మే 15వ తేదీన ప్రారంభమైన సరస్వతి. పుష్కరాలు 26వ తేదీ సోమవారం నాటితో సరస్వతి పుష్కరాల 12 రోజుల కార్యక్రమం ముగియ నున్నందున కాళేశ్వరానికి భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగిపోతున్నది.

ఇకపోతే సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరంలో అత్యంత హైలెట్ గా నిలుస్తోంది త్రివేణి సంగమంలో నిర్వహించే హారతి. హారతి నిర్వహించేందుకు కాశీ నుండి ప్రత్యేకంగా పండితులను తీసుకుని వచ్చారు. వీరు రోజు రాత్రి త్రివేణి సంగమ తీరాన నిర్వహిస్తున్న హారతి తంతు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే కాశీ గంగలో నీటి ప్రవాహంపై బోట్లలో కూర్చుని తిలకించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కాళేశ్వరంలో నది తీరం 3 నుండి 4 కిలో మీటర్ల మేర విస్తరించి ఉండడంతో నీటి ప్రవాహం మినహాయిస్తే మిగతా ప్రాంతమంతా కూడా ఇసుక మాత్రమే ఉంటుంది. దీంతో భక్తులు అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే త్రివేణి సంగమంలో ఉంటూ హారతిని వీక్షించే అవకాశం కల్పించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతి రోజు సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులు ఇంటి నుండి ప్రత్యక్షంగా తిలకించేందుకు అవకాశం కల్పింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రముఖులతో పాటు సాధారణ భక్తులు కూడా హారతిని వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రతి రోజు హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులుగా వర్షం నకురుస్తున్నా హారతి కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వనిస్తున్నారు.
రోజు రాత్రి 45 నిమిషాలకు పైగా నిర్వహించే హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకే పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరంలో ఉండిపోతున్నారు. హారతి అనంతరం స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారంటే హారతి కార్యక్రమానికి ఎంతో ఆదరణ లభిస్తోంది.

యముడు, శివుడు

ఇకపోతే రోజు కాళేశ్వరం త్రివేణి సంగమంలో నిర్వహించే హారతి కార్యక్రమంతో పాటు శశుక్రవారం శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి సన్నిధిలో కాశీ.పండితులు హారతి కార్యక్రమం నిర్వహించారు.
గర్భాలయంలో
నిర్వహించిన ఈ కార్యక్రమంతో కాళేశ్వరం ఆలయ ప్రాంగణమంతా హర హర మహాదేవో శంభో శంకర అంటూ నినాదాలతో మారు మోగింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులు కూడా వీక్షించే అవకాశం కల్పించడంతో వారంతా అత్యంత భక్తి శ్రద్దలతో వీక్షిస్తూ మంత్రముగ్ధులవున్నారు.

Share this post

2 thoughts on “అంతర్వాహిని సరస్వతి పుష్కరాలతో కాంతుళీను తున్న కాళేశ్వరం

  1. I got what you intend, regards for putting up.Woh I am lucky to find this website through google. “The test and use of a man’s education is that he finds pleasure in the exercise of his mind.” by Carl Barzun.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం
కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల