Headlines

అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌కు వాషింగ్టన్ డి.సిలో అభినందనలతో ఘన స్వాగతం

laura williams

అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌కు వాషింగ్టన్ డి.సిలో అభినందనలతో ఘన స్వాగతం

      

వాషింగ్టన్ డి.సి:జూలై 29, 2025 – హైదరాబాద్‌కు వచ్చే అమెరికా కొత్త కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ కు వాషింగ్టన్ డి.సిలో అభినందనలతో ప్రత్యేకంగా  ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమాన్ని ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ (IAMBIG) సహ వ్యవస్థాపకుడు రవి పులి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో లారా మాట్లాడుతూ భవిష్యత్తు దౌత్యంలో నమ్మకం, సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రజల ప్రతిభ కీలకంగా మారుతున్నాయని అన్నారు. అమెరికా-భారత సంబంధాలు ఈ అంశాల ప్రాతిపదికన మరింత బలపడతాయని చెప్పారు.


సాంకేతిక రంగాలపై దృష్టి


ఆమె మాట్లాడుతూ, “సైబర్ భద్రత అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అమెరికాలో సైబర్ వారియర్ల రూపాకల్పన జరిగితే, భారతదేశంలో — ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో — మరెంతో సాధించవచ్చు” అని అన్నారు.
కృత్రిమ మేధస్సు (AI), బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో భారతదేశం ఎంతో పురోగతితో మంచి అవకాశాలతో ముందుకు పోతుందన్నారు. “హైదరాబాద్‌కు రావడం యాదృచ్ఛికం కాదు. ఇది ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా ఎదుగుతోంది” అన్నారు.

వీసా సమస్యలపై స్పష్టత


వీసా ఆలస్యాలపై ఆమె మాట్లాడుతూ, హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన కాన్సులేట్‌లో 54 వీసా కౌంటర్లు ఉన్నాయని, ఇంకా పూర్తిగా సిబ్బంది నియామకం కాలేదని చెప్పారు. త్వరలో  సిబ్బంది పెరిగితే, ఆటోమేషన్ మరియు AI సాయంతో వీసా ప్రక్రియ వేగంగా సాగుతుందని తెలిపారు.

ప్రాంతీయ అభివృద్ధికి సహకారం


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పురోగతికి  తాను పూర్తిగా సహకరిస్తానని  తెలిపారు. రవి పులి  ఆతిథ్యాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఇక్కడి వంటకాలు, సంస్కృతిని ఆస్వాదించి ఆనందించానని” అన్నారు.

భారత్‌తో వ్యక్తిగత అనుబంధం
తన చిన్నప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ, “13 ఏళ్ళ వయస్సులో భారత్‌కు వచ్చాను. తర్వాత హిందీ నేర్చుకున్నాను. రాజస్థాన్‌లో బయోగ్యాస్ పై పరిశోధన చేశాను. ఇప్పుడు నా కుటుంబంతో కలిసి భారత్‌కు తిరిగి రావడం తనకు ప్రత్యేక అనుభూతి” అని చెప్పారు.

ravi puli

లారా అనుభవాన్ని  కొనియాడిన రవి పులి

రవి పులి  మాట్లాడుతూ, “లారా గారికి మంచి అనుభవం, అంకితభావం రెండూ ఉన్నాయి… ఆమె భారతీయ అమెరికన్లను అర్థం చేసుకుంటున్నారు. అమెరికా-భారత దేశాల మధ్య మెరుగైన భాగస్వామ్యానికి ఆమె సంపూర్ణంగా సహకరించగలరనే నమ్మకం ఉంది” అన్నారు.

సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ సమావేశంలో విద్య,ఫార్మసి, అంతరిక్ష, రియల్ ఎస్టేట్, క్లీన్ ఎనర్జీ రంగాల నుండి పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
CII, FICCI, USIBC, భారత ప్రభుత్వ ప్రతినిధులు మరియు థింక్ ట్యాంక్‌లు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం చివర్లో వాషింగ్టన్‌లోని హైదరాబాద్ బేకరీ రూపొందించిన కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధానికి చిహ్నంగా నిలుస్తుందని రవి పులి అన్నారు.

IAMBIG గురించి

ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ (IAMBIG) అనేది అమెరికాలోని భారతీయ పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పెట్టుబడిదారుల నెట్‌వర్క్. ఇది అమెరికా-భారత సంబంధాల అభివృద్ధికి దౌత్య, ఆర్థిక, సామాజిక రంగాల్లో  తొడ్పాటు నందిస్తోంది.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE