ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు మంజూరు…..
దేవాదుల 3వ దశ 6వ ప్యాకేజీ పనులకు 1001 కోట్లు మంజూరు……
నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం…..
ఏడాదిలో అన్ని పనులు పూర్తి చేయిస్తా…..
పనిలేని వారి మాటలు నేను పట్టించుకోను…..
నా లక్ష్యం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం…..
స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి…..
జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలి….
బిసిల రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దత్తు ఇవ్వాలి….
అనవసరపు మెలికలు పెట్టి బిసిల అవకాశాలను దెబ్బతీయవద్దు….
నాకున్న ఏకైక లక్ష్యం నియోజకవర్గ అభివృద్ధి, ఏకైక ఎజెండా ప్రజల సంక్షేమం మాత్రమేనని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ……
ఎన్నికల సమయంలో అవకాశం ఇస్తే ఘనపూర్ ను మున్సిపాలిటీ చేస్తా, నిధులు తీసుకువచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చానని ఇచ్చిన మాట ప్రకారం జనవరిలోనే మున్సిపాలిటీ చేశానని, మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఎక్కువ నిధులు మనకే వచ్చాయని తెలిపారు. మనపై ఉన్న ప్రేమతో ఎక్కువ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్ హల్, ఇంటిగ్రెటెడ్ మార్కెట్, సిసి రోడ్లు, డ్రైన్లు, రోడ్డు వెడల్పు వంటి పనులకు 50కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఈ పనులు అన్నింటిని ఏడాదిలో పూర్తి చేస్తానని వీటితో పాటు 100పడకల అస్పత్రి, డివిజనల్ ఆఫీస్, డిగ్రీ కళాశాల ఏర్పాటుతో ఘనపూర్ మున్సిపాలిటీ రూపు రేఖలు మారుతాయాన్ని పేర్కొన్నారు.
దేవాదుల 3వ దశ ప్యాకేజీ 6 పనులను కాంట్రాక్టర్లు చేయలేమని వదిలేసారని దింతో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 78వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్న ఈ పనులను పూర్తి చేయాలనీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే వెంటనే సవరించిన అంచనాలతో 1001 కోట్ల మంజూరు చేశారని తెలిపారు. దీని ద్వారా జఫర్ గడ్ మండలంలో ఉప్పుగల్ చెరువు, జఫర్ గడ్ పెద్ద చెరువును రిజర్వాయర్ గా చేసుకోబోతున్నామని, ఒక్క జఫర్ గడ్ మండలంలోనే 10వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఏడాది కాలంలో దేవాదుల పెండింగ్ పనులు, గండి రామారం కుడి కాలువ మరియు లిఫ్ట్ పనులను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గానికి ఎం కావాలి, ప్రజలకు ఎం చేయాలి అనే ఆలోచనతోనే పని చేస్తున్నాని అన్నారు. నియోజకవర్గ రైతులకు సాగు నీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జరుగుతుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాని వెల్లడించారు. పనిలేని వారి మాటలు నేను పట్టించుకోనని, తన లక్ష్యం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం మాత్రమేనని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని, అందురూ ఒకే పార్టీ వారు ఉంటే అభివృద్ధి సుగమం అవుతుందని అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం తీసుకొని సహసోపేత నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు పంపించినట్లు తెలిపారు. బిసిలపై ప్రేమ ఓలకబోసే పార్టీలు బిసి రిజర్వేషన్లకు మద్దత్తు తెలపాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని, ఎవరైనా కోర్టుకు వెళ్లినా కేసులు ఉపసంహారించుకోవాలని కోరారు. జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలని, అనవసరపు మెలికలు పెట్టి బిసిల అవకాశలను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article. https://www.binance.info/register?ref=IHJUI7TF
you’re really a good webmaster. The site loading speed is amazing. It seems that you’re doing any unique trick. In addition, The contents are masterpiece. you have done a excellent job on this topic!