ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ‘బార్ కౌన్సిల్’ ఎన్నికలు…

” పులి” నేతృత్వంలో… 16 పోలింగ్ బూత్ లు…

పోస్టులు 23… బరిలో 203 మంది…

హన్మకొండలోనే 1041 న్యాయ వాదుల ఓట్లు…

టెన్ కోర్టు కాంప్లెక్స్ లో భారీ ఏర్పాట్లు…

ఎన్నికల అబ్జర్వర్ గా మేజిస్ట్రేట్ ప్రియాంక..

చీఫ్ పోలింగ్ ఆఫీసర్ గా హన్మకొండ బార్ ప్రెసిడెంట్ సత్యనారాయణ…

తెలంగాణా వ్యాప్తంగా హోరాహోరీ 133 బార్లలో పోలింగ్ కు సర్వం సిద్ధం…

అచ్యుత రఘునాథ్
( ప్రత్యేక ప్రతినిధి – హన్మకొండ)

నువ్వా…నేనా… అన్న రీతిలో హోరాహోరీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 బార్ అసోసియేషన్ ల పరిధిలోని వందలాది మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును సద్వినియోగ పరుచుకునే తరుణం ఆసన్నమైంది. ఒక్కొక్కరు 23 ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో వేసేలా రంగం సిద్ధమైంది. 30వ తేదీ శుక్రవారం జరిగే పోలింగ్ ఘట్టంలో ఒక్కొక్క న్యాయవాది 23 ఓట్లు ప్రాధాన్యతా క్రమంలో వేసి తమ భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని 133 బార్ అసోసియేషన్లలో ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది.
ఈ మేరకు హన్మకొండ జిల్లా కేంద్రం లోని కోర్టుల సముదాయాల పరిధిలో ఉన్న “టెన్ కోర్టు complex సెల్లార్” లో 16 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసిన చీఫ్ పోలింగ్ ఆఫీసర్ (ప్రధాన పోలింగ్ అధికారి) పులి సత్యనారాయణ హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో తన బార్ ప్రతినిధులతో గురువారం పోలింగ్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో బాగంగా హన్మకొండ బార్ నుంచి 1041 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంలో తల మునకలయ్యారు. స్వయంగా పర్యవేక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, చీఫ్ పోలింగ్ ఆఫీసర్ పులి సత్యనారాయణ వెంట బార్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, ఉపాధ్యక్షులు సీహెచ్ రమేష్, సంయుక్త కార్యదర్శి అంబేద్కర్, మహిళా సంయుక్త కార్యదర్శి నాగేంద్ర, లైబ్రరీ కార్యదర్శి కే. వెంకట్, స్పోర్ట్స్ కార్యదర్శి మల్లేశం, కోశాధికారి సీహెచ్. సాంబశివరావు, బార్ కార్యవర్గ సభ్యులు సునీల్, నిఖిల్, కమలాకర్, శివకుమార్,తదితరులు ఉన్నారు.
అబ్జర్వర్ గా మేజిస్ట్రేట్ ప్రియాంక ..
తెలంగాణ బార్ కౌన్సిల్ మొత్తం ఎన్నికల పరిశీలకురాలిగా మూడవ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సిరిసిల్ల ప్రియాంక వ్యవహరించనున్నారు. తెలంగాణా లోనే హన్మకొండ పోలింగ్ స్టేషన్ కు 104 వ నంబర్ కేటాయించి ఇందులో 16 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయడం విశేషం. వీటి పరిధిలో 1041 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.

సాఫీగా పోలింగ్ లో పాల్గొనండి…
“పులి” పిలుపు
హన్మకొండ న్యాయవాదులంతా ప్రశాంతంగా… సాఫీగా పోలింగ్ లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు ఉత్తమ ప్రతినిధులను ఎన్నుకోవాలని హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన పోలింగ్ అధికారి పులి సత్యనారాయణ న్యాయ వాదులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ప్రాంగణంలో ఉన్న టెన్ కోర్టు కాంప్లెక్స్ సెల్లార్ లో సకల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. హన్మకొండ నుంచి 1041 మంది ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో 23 చొప్పున ఓట్లు వేసేలా రాష్ట్ర బార్ కౌన్సిల్ కు సర్వం సిద్ధం చేశామని ప్రకటించారు. ఈ మేరకు పోలీస్, వైద్య, న్యాయ పరమైన అధికారులతో సంప్రదించి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. న్యాయవాద ఓటర్లు నేరుగా పోలింగ్ బూత్ లకు వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పులి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల బరిలో…
హన్మకొండ నుంచి ఏడుగురు..
వరంగల్ నుంచి నలుగురు..
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల బరిలో 203 మంది అభ్యర్థులు తలపడుతుంటే…ఇందులో హన్మకొండ బార్ నుంచి ఏడుగురు… వరంగల్ బార్ నుంచి నలుగురు తలపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కేవలం 23 మందికి మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ 203 మంది న్యాయవాదులు కౌన్సిల్ పదవి కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో వేలాదిగా ఉన్న ఓటర్లు కనీసం ఒక్కొక్కరు ఐదు ఓట్లు వేస్తేనే బ్యాలెట్ పత్రం చెల్లుతుంది. గరిష్టంగా 23 మందికి ఓటు వేయవచ్చు. అయితే ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే క్రమంలో ఆంగ్ల అక్షరాల్లో స్పెల్లింగ్ మిస్టేక్ తో ప్రాధాన్యత ను గుర్తిస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. దీనిపైనే అందరు న్యాయవాదులు తమ దృష్టిని కేంద్రీకరించారు.

కోర్టుల్లో పండగ వాతావరణం…*
తెలంగాణ వ్యాప్తంగా అయిదేళ్ల కోసం అవసరమయ్యే కీలకమైన బార్ కౌన్సిల్ ఎన్నికల తో అన్ని జిల్లాల్లోని 133 బార్ లలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా తెలంగాణ హై కోర్టు నేరుగా పర్యవేక్షించే ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 30 వ తేదీ పోలింగ్ ఘట్టం తో 23 మంది నేతలను ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకుని నెలరోజుల ప్రచార హడావుడి కి న్యాయవాదులు తెరదించనున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన