Headlines

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ -శాసన మండలిలో మంత్రి పొంగులేటి


వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మంగళవారం నాడు పలువరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం ఇచ్చారు. జర్నలిస్టు మిత్రులకు భద్రత కల్పించే విషయములో ఈ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులు జారీచేస్తాం. ఎలాంటి బేషజాలాలకు పోకుండా మొదట విడుదల చేసిన జీ.ఓ. పై అన్ని జర్నలిస్టుల సంఘాల అభిప్రాయాలను, సూచనలను తీసుకొని జీ.ఓ.లో మార్పులు చేర్పులు చేసాము. డెస్క్ జర్నలిస్టులు మరో జర్నలిస్టులనే తేడ మా ప్రభుత్వానికి లేదన్నారు.
ఇండ్ల స్థలాల విషయములో కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికి ఈ విషయములో గౌరవ ముఖ్య మంత్రి గారు స్పష్టత ఇచ్చారని, న్యాయస్థానం పరిధిలో ఇబ్బందులు లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామని వెల్లడించారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం