Headlines

45 ఏళ్ల దాంపత్య జీవితంలో ధర్మేంద్ర–హేమా మాలిని ఎందుకు కలిసి ఉండలేక పోయారు

కలిసి ఎందుకు ఉండలేదు? కారణాలు ఏమిటి? హేమమాలిని ఏం చెప్పారు?….
ముంబయి:నవంబర్,24,2025:
సినీ నటులు ధర్మేంద్ర హేమా మాలిని మధ్య ఉన్న సంబంధం విషయంలో వార్తల్లో అనేక అంశాలు ప్రస్తావణలోకి వచ్చాయి. ధర్మేంద్ర, హేమమాలిన బంధం అనేక ప్రశ్నలకు జవాబు లేని పత్రంగా మిగిలింది. 1980లో పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు నటులు ఇద్దరు కుమార్తెలకు తల్లిదండ్రులు అయినప్పటికీ, ఎప్పుడూ కలిసి నివసించలేదా?.. ఈ ప్రశ్నకు అవుననే బాలీవుడ్ మీడియా కోడయ్ కూసింది. బహుశా ఈ విషయం బాలీవుడ్ వార్తల పై అవగాహన ఉన్నవారికి తప్ప యంగర్ జనరేషన్స్ కు తెలియక పోవచ్చు.


1970లలో తూ హసీన్ మై జవాన్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ పరిచయం అయ్యారు. ఆ సమయంలో ధర్మేంద్ర అప్పటికే ప్రజాదరణ పొందిన పాపులర్ నటుడు.అంతేకాక ప్రకాశ్ కౌర్‌తో అప్పటికే వివాహం జరిగింది.

హేమా మాలిని మాత్రం సినీ రంగంలో అప్పుడప్పుడే ఎదుగుతున్న దశలో ఉన్నారు. సినిమా సెట్లపై ముందు స్నేహం తో మొదలై తెరపై తర్వాత ప్రేమగా మారింది.
హేమా మాలిని జీవిత చరిత్ర బియాండ్ ది డ్రీమ్ గర్ల్ ప్రకారం, ఆమె తల్లి జయ చక్రవర్తి, జితేందర్‌ను పెళ్లి చేసుకోవాలని సూచించారు. అదేవిదంగా జితేందర్, సంజీవ్ కుమార్ కూడా ఆమెకు పెళ్లి ప్రతిపాదనలు చేశారు. అయినప్పటికీ ఆమె ధర్మేంద్రనే ఎంచుకున్నారు.
1980లో, ధర్మేంద్ర మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. ఈ నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. మొదటి వైవాహిక బంధాన్ని కొనసాగించినందున, హేమా మాలినికి సంప్రదాయ కుటుంబ స్థానాన్ని ధర్మేంద్ర ఇవ్వలేదు.
ఈ విషయాన్ని తమ వివాహ సమయంలోనే పూర్తిగా అర్థం చేసుకున్నానని హేమా మాలిని చెప్పిన సందర్భలున్నాయి. అందుకే ఇరువురు ఒక్కచోట నివసించకూడదనే నిర్ణయాన్ని అంగీకరించింది. ఈ సంబంధం పరస్పర గౌరవం మరియు కొన్ని స్పష్టమైన పరస్పర హద్దులపై ఆధారపడి కొనసాగింది.
వివాహానికి ముందు కొన్ని సినిమా కార్యక్రమాల్లో ప్రకాశ్ కౌర్‌ను కలిసినప్పటికీ, తరువాత ఆమెను ఎప్పుడూ కలవలేదని హేమా మాలిని చెప్పారు.

జూహూలో డియోల్ కుటుంబం ఉన్న ఇంటికి ఎంతో దగ్గర్లో ఉండినా కూడా ఆమె అక్కడికి వెళ్లలేదు. ఇలా వేరు వేరుగా నివసించడం సమస్యలను నివారించిందని ఒక ఇంటర్వ్యూలో హేమమాలిన వివరణ ఇచ్చారు.
లెహ్రెన్‌కు ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలో, ఈ విధమైన జీవన విధానం ఇద్దరికీ అనుకూలంగా పనిచేసిందని, వారి సంబంధం నిలకడగా ఉండటానికి ఇది సహాయపడిందని హేమా మాలిని పేర్కొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు