ఆర్. నారాయణమూర్తిని చూసి చంద్రబాబు, రేవంత్ సిగ్గుపడాలి: సీపీఐ నారాయణ

cpi narayana

ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇచ్చిపడేసాడు …నారాయణ

హైదరాబాద్:“పీపుల్స్ స్టార్” ఆర్. నారాయణమూర్తి వంటి గొప్ప వ్యక్తిని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారాయణమూర్తి తీసే సందేశాత్మక చిత్రాలకు ప్రభుత్వాలు ఎందుకు రాయితీలు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

సందేశాత్మక చిత్రాలకు రాయితీలు ఏవీ?

నారాయణమూర్తి ఇటీవల తీసిన ‘యూనివర్సిటీ’ చిత్రాన్ని ఉదాహరణగా చూపుతూ నారాయణ మాట్లాడారు. “నారాయణమూర్తి ‘యూనివర్సిటీ’ అనే సినిమా తీశారు. అందులో ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఎలా ప్రభావితం అవుతారు, ఎంత బాధపడతారు అనేది చూపించారు. ఒక సందేశాత్మక కోణంలో ఆ చిత్రాన్ని తీశారు. ఆ సినిమా ప్రివ్యూ చూశాను. నాకే ప్రభుత్వ సహాయం అక్కర్లేదని నారాయణమూర్తి అంటున్నాడు. అలాంటి నారాయణమూర్తిని చూసి సిగ్గుతెచ్చుకోవాలి,” అని నారాయణ అన్నారు.

పెద్ద సినిమాలకు రాయితీలు, సామాజిక చిత్రాలకు నిరాకరణ

కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసే సినిమాలకు రాయితీలు ఇస్తూ, సామాజిక సందేశం ఉన్న చిత్రాలను పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోట్ల రూపాయలతో సినిమాలు తీసేవాళ్లకు మీరు రాయితీలు ఇస్తారా? ఏపీ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ… పవన్ కల్యాణ్ సినిమాకు, పుష్ప సినిమాకు, బాహుబలి సినిమాకు… ఇలాంటి వాటికి రాయితీ ఇవ్వడం ఏంటి? టికెట్ రేట్లు పెంచుకోమనడం, బ్లాక్‌లో అమ్ముకోమనడం ఏంటి? ఇది దివాలాకోరు రాజకీయం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి పనులను ప్రజలు అసహ్యించుకుంటారు. ఈ సినిమాల్లో ఏవైనా సందేశం ఇచ్చారా?” అని నారాయణ నిలదీశారు.

ఎర్రచందనం, బ్లాక్ మనీ, క్రైమ్, హింసను ప్రోత్సహించే సినిమాలకు రాయితీలు ఇస్తూ, సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలకు మాత్రం ప్రభుత్వాలు ఎందుకు సహాయం చేయడం లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. “సమాజానికి ఉపయోగపడే సినిమాలకు మాత్రం మీరు రాయితీలు ఇవ్వడంలేదు… ఇంతకంటే దివాలాకోరు రాజకీయం ఉంటుందా?” అంటూ నారాయణ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Share this post

One thought on “ఆర్. నారాయణమూర్తిని చూసి చంద్రబాబు, రేవంత్ సిగ్గుపడాలి: సీపీఐ నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి