మంచిర్యాల: రూ.2 లక్షల లంచం స్వీకరిస్త ACB కి చిక్కిన సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్
మంచిర్యాల జిల్లాకు చెందిన సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సహకార అధికారి (FAC) రాథోడ్ భిక్కు లంచం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల చేతికి చిక్కారు.
ఫిర్యాదుదారుని సస్పెన్షన్ నుండి పునర్‌నియామకానికి కమిటీకి సానుకూల నివేదిక పంపించడానికి, జీత స్థిరీకరణకు సంబంధించిన G.O. నంబర్ 44ను అమలు చేయించి పెండింగ్‌లో ఉన్న పెరిగిన జీతాల బిల్లులను సిద్ధం చేయడానికి, సస్పెన్షన్ కాలపు జీతభత్యాలను చెల్లించేందుకు మరియు తనపై విచారణ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రాథోడ్ భిక్కు రూ.7 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ACB పేర్కొంది.
ఫిర్యాదుదారు అభ్యర్థన మేరకు ఆ మొత్తం రూ.5 లక్షలకు తగ్గించగా, అందులో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు స్వీకరిస్తూ రాథోడ్ భిక్కు గురువారం అధికారుల చేతికి దొరికిపోయారు.
ACB అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

