ఓయూ క్యాంపస్ లో సిఎమ్ రేవంత్ రెడ్డి


ఉస్మానియా యూనివర్సిటీలో నూతన భవనాల ప్రారంభోత్సవం చేసిన సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి, కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీని “తెలంగాణకు అవిభక్త కవల”గా పేర్కొన్నారు.


1938 రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరి లూదిన గడ్డ ఇదేనని, దేశానికి నాయకత్వం ఇచ్చిన పీవీ నర్సింహారావు, శివరాజ్ పాటిల్, జైపాల్ రెడ్డి లాంటి మహానుభావులు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని గుర్తుచేశారు. “తెలంగాణలో సమస్య వస్తే మొదట చర్చ జరిగేది ఇక్కడే. చదువుతో పాటు పోరాటం నేర్పిన నేల ఇది” అని అన్నారు.


గత పదేళ్లలో యూనివర్సిటీని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరిగిందని ఆరోపించిన సీఎం, తన ప్రభుత్వం దాన్ని మళ్లీ వైభవం చేకూర్చేందుకు కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీల నియామకాలు చేశామని, మేధా సంపత్తి ఉస్మానియా నుంచే వెలువడాలని ఆశిస్తున్నామని తెలిపారు.


ప్రస్తుతం యువతను గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలు పట్టిపీడిస్తున్నాయని, వాటి నుంచి బయటపడేలా చైతన్యం అవసరమని చెప్పారు. “నా దగ్గర పంచడానికి భూమి లేదు, ఖజానా లేదు. మీకు ఇవ్వగలిగింది ఒక్కటే – విద్య” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
యూనివర్సిటీ అభివృద్ధికి ఇంజనీర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, ఉస్మానియాను స్టాన్‌ఫర్డ్‌, ఆక్స్‌ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. “ఉస్మానియా లేకుంటే తెలంగాణే లేదు. ఈ యూనివర్సిటీ చరిత్రకు సాక్షిగా నిలవాలి” అని అన్నారు.


త్వరలో మళ్లీ యూనివర్సిటీకి వచ్చి, ఆర్ట్స్ కాలేజీ వద్ద సమావేశం నిర్వహించి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఆ రోజున యూనివర్సిటీలో ఒక్క పోలీసు కూడా కనిపించకూడదని, నిరసన తెలిపే వారిని అనుమతించాలన్న ఆదేశాలు పోలీసులకు ఇచ్చారు.
ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించిన ఆయన, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియాను ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

రాజ కీయ ఉత్కంట

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీసింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, ఆయన పర్యటనలో ఏదైనా అంతరాయం ఏర్పడుతుందేమోనని ఆసక్తి తోచూసారు.

ఉస్మానియా అంటేనే ధిక్కారం. ముఖ్యమంత్రి కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత రెండు దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు. అసలు విద్యార్థులు రానీయ లేదు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువైన ఈ యూనివర్సిటీ, విద్యార్థుల ఆగ్రహం కారణంగా సార్వత్రికంగా ముఖ్యమంత్రులు, మంత్రులకు దూరంగానే ఉండేది.


2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యార్థుల అంచనాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఆశలు నెరవేరకపోవడంతో కేబీఆర్‌ఎస్ పాలనపై ఆవేదన పెరిగింది.
2023లో పీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి యూనివర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చి, కొత్త భవనాలను ప్రారంభించి, విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఉస్మానియాకు గత వైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు చేర్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, విద్యార్థి ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న ఉస్మానియాను చేరుకోవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి యువతతో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, తన ప్రత్యర్థులకు గట్టి సందేశం పంపినట్టే అని భావిస్తున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి
అమెరికా డాలర్ కు ఆవలివైపు….
మోడీకి ట్రంప్ చిక్కుముడి