తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగవని, దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలి ఎన్నికలతోపాటే నిర్వహించబడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తన పదవీకాలం ఐదేళ్లు కాకుండా ఐదున్నరేళ్లు ఉంటుందని, అనంతరం మరో ఐదేళ్లు కొనసాగుతానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గురువారం న్యూఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేసి, ఆ తర్వాత అరవై రోజుల్లో జనాభా లెక్కలను ప్రకటిస్తుందని సీఎం తెలిపారు. వచ్చే ఏడాది మే-జూన్ నాటికి జనాభా గణాంకాలు వెలువడిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్‌ను ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఏడాది లోపే నియోజకవర్గాల విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకుంటారని, 2029లో కొత్త నియోజకవర్గాల ప్రకారం జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం అన్నారు. లేదంటే హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఫార్ములా-ఈ రేస్ కేసును ఈడీకి అప్పగించినప్పటికీ చర్యలు లేవని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారాలపై కూడా దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. భారాసతో లోపాయికారీ ఒప్పందం లేదని చెప్పుకుంటే ఈ అంశాలన్నింటిపైనా విచారణ జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు సంబంధించిన అంశాల్లో సీబీఐ దర్యాప్తుకు పూర్తిస్థాయి జనరల్ కన్సెంట్ ఇవ్వకపోయినా, కేసు వారీగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.
తాను భారాసతో కుమ్మక్కయ్యానని కిషన్ రెడ్డి ఆరోపిస్తుండగా, భాజపాతో కలిసి రాజకీయాలు చేస్తున్నానని కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఆరోపిస్తున్నారని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిగా తన పని తప్పు చేసిన వారిని శిక్షించడం, మంచివారిని రక్షించడం మాత్రమేనని స్పష్టం చేశారు. భాజపా ఇటు భారాస, అటు ఎంఐఎంతో కలిసి రాజకీయాలు చేస్తోందని, ఎంఐఎం భాజపాకు అవసరమైన చోట పరోక్ష సహకారం అందిస్తోందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్ రావును భారత్‌కు రప్పించడంలో కేంద్రం సహకరించలేదని సీఎం తెలిపారు. 20 నెలలపాటు న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఆయనను రప్పించాల్సి వచ్చిందన్నారు. విచారణలో పైన ఉన్నవారి ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పినట్టు మీడియాలో కథనాలు వచ్చాయని, ఆ ఆధారాలతోనే దర్యాప్తు అధికారులు మరికొందరిని విచారించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ కేసులో సిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తోందన్నారు. ఆ బాధ్యతలను ప్రస్తుతం సజ్జనార్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు దెబ్బతిన్నట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారని సీఎం పేర్కొన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కేఆర్ సురేశ్ రెడ్డి మాత్రం 100 పిల్లర్లలో మూడు మాత్రమే కుంగాయని, వాటిని మరమ్మతు చేస్తే సరిపోతుందని చెబుతున్నారని విమర్శించారు. వారు సూచించిన విధంగా నీరు నిల్వ చేస్తే 33 పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.


Bạn có thể gửi phản hồi trực tiếp từ giao diện 888slot – đội ngũ sản phẩm sẽ tiếp nhận, đánh giá và triển khai cải tiến trong các bản cập nhật tiếp theo. TONY02-26H
Im no longer certain where you’re getting your information, however good topic. I must spend some time finding out much more or working out more. Thanks for magnificent info I was searching for this info for my mission.