మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన సిఎం మంత్రులు

cm revanth

ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం…

  • రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రారంభించడం ఆనందకరం…
  • మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు
  • ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికిన ఉన్నతాధికారులు
  • ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం
  • మాచారం బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మాచారం మే 19,2025: అచ్చంపేట నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల భూముల్లో జలకళ కోసం ప్రవేశపెట్టిన “ఇందిరా సౌర గిరి జల వికాసం” పథకం ప్రారంభోత్సవం సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని మాచారం గ్రామంలో అట్టహాసంగా ప్రారంభించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటి సిఎం మల్లు భట్టివిక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు,ధనసరి అనసూర్య సీతక్క, పొన్నం ప్రభాకర్ ఎంపీ మల్లురవి పలువురు ఎమ్మెల్యేలు అధికారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. పథకం ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేసిన రైతులు, ఈ కార్యక్రమం తమ జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సోలార్ పంపుసెట్లతో పాటు పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి రైతులకు అదనపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 100 రోజుల్లో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు.

ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవం అనంతరం జరిగిన భారి భహిరంగ సభలో

ముఖ్యమంత్రి ప్రసంగించారు.

“నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నిలబడి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం,” అని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టగా, తమ ప్రభుత్వం ఆ భూముల్లో సోలార్ పంపుసెట్లు అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు.

సోలార్ పంపుసెట్లు ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వమే ముందుందని చెప్పిన సీఎం, “పోడు భూములపై పోరాడిన వారిని జైల్లో వేసినది గత ప్రభుత్వం. కానీ మేము ఆ భూముల్లోనే సోలార్ పంపులు పెట్టి పంటలు పండేలా చేస్తున్నాం” అన్నారు.

100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని రైతులకు సోలార్ పంపుసెట్లు అందించాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం కావాల్సిన నిధుల బాధ్యతను తనమే తీసుకుంటానన్నారు. నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

సంక్షేమమే మా గుర్తింపు

  • రూ. 60 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం
  • సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు ₹500 బోనస్
  • పేదలకు సన్న బియ్యం – 3.10 కోట్ల మంది లబ్ధిదారులు
  • 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు

“అదానీ, అంబానీలతో పోటీ పడేలా మన ఆడబిడ్డలను ప్రోత్సహిస్తున్నాం. ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దే మార్గంలో ముందుకెళ్తున్నాం” అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

తప్పుడు ప్రచారాలపై కౌంటర్

కొంతమంది అక్రమ సంపాదనదారులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, “వారికి ప్రజలే బుద్ధి చెబుతారు. నేను వాటిని పట్టించుకోను. నాకు బాధ్యత తెలుసు – పేదల ఆకలి తీర్చడమే నా లక్ష్యం” అన్నారు.

“రైతులు పాసుపుస్తకాలు చూస్తే రుణమాఫీ గుర్తొస్తుంది. బస్సులో ప్రయాణించే ఆడబిడ్డలకు మన ఉచిత ప్రయాణ పథకం గుర్తుంటుంది. మా పథకాలే ప్రజలకు నిజాలను చెబుతాయి” అని అన్నారు.

గడిచిన 16నెలల్లో తెలంగాణాను నెంబర్ వన్ స్థానంలో నిలిపామని తెలిపారు.పన్నుల వసూలులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్రం పేర్కొందని అన్నారు.

పాలన చేతకాదన్న వారికి ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. పాలమూరు బిడ్డలు మట్టిపని తట్టపనిలోనే కాకుండా పరిపాలనలో కూడ నెంబర్ వన్ గా నిలిచారని అన్నారు.

ప్రభుత్వం గత కొద్ది నెలల్లో రైతుల కోసం రూ. 60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. “తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శాంతిభద్రతలు, నిత్యావసర ధరల నియంత్రణలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది,” అని సీఎంపేర్కొన్నారు.

ప్రజల హృదయంలో నిలిచిపోతుందీ పాలన

“ఎంతమంది ప్రధానులు వచ్చినా… ప్రతి తండాలో పేదవాడి గుండెల్లో నిలిచిపోయింది మాత్రం ఇందిరమ్మే. ఇప్పుడు ఆ మార్గంలోనే మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది” అని చెప్పారు సీఎం.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న ‘దున్నేవానికి భూమి’ నినాదాన్ని ఇందిరా సౌర గిరి జల వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నాం. ఈ పథకం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది,” అని అన్నారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని, నల్లమల డిక్లరేషన్‌ను తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 2న గిరిజన యువతకు రూ. 1,000 కోట్లతో స్వయం ఉపాధి పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు.

Share this post

One thought on “మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన సిఎం మంత్రులు

  1. **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన