జాగో బి.సి. చలో విలేజీ
గ్రామాలకు తరలండి రాజ్యాధికారం చేపట్టండి
పల్లెను గెలుద్దాం డిల్లీని ఏలుదాం
బి.సి ల బావితర భవిషత్ బి.సి ఓటులోనే వుంది
పల్లె పల్లె కు పాట పార్లమెంట్ కు బాట అని పిలుపునిచ్చిన గద్దర్ అన్న బాటలో పయనిద్దాము. పల్లెను గెలుద్దాం… డిల్లీని ఏలుదాం. నిశ్శబ్ద యుద్ధంలో బి.సి లను గెలిపిద్దాం
పల్లెను గెలవకుండా పార్లమెంట్ లో అడుగుపెట్టలేము. చట్టసభల్లో బి.సి వాటా పొందకుండా విముక్తి సాధ్యం కాదు.
ఓట్లు మనవే, ఓట్లు వేసేది మనమే. సీట్లు కూడా మనవే కావాలి
ఓటు హమారా సీటు తుమరా నై చలేగా నై చలేగా
భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన మనం విముక్తి కోసం మన ఓటు మనవాళ్లకు వేసుకుందాం
బి.సి సర్పంచ్ ల గెలుపుతోనే సామాజిక న్యాయానికి పునాది
పల్లెను గెలుద్దాం ఢిల్లీ ని ఏలుదాం
బి.సి ల గెలుపుతోనే బహుజన రాజ్య స్థాపన
ఎస్సీ, ఎస్టీ, బి.సి ల ఐక్యత వర్ధిల్లాలి
S.C, S.T లకు అంబేద్కర్ హక్కులిస్తే, బి.సి లు ఓట్లేసి గెలిపిస్తున్నారు
బి.సి లకు ఎస్సి, ఎస్టీ లు ఓట్లేసి గెలిపించి బహుజన రాజ్య స్థాపనకై ఐక్యంగా నిలబడండి
రాజకీయ పార్టీలు చేస్తున్న ద్రోహాలకు ఓటు ఆయుధంతో బుద్ధి చెపుదాం.
పార్టీలకు అతీతంగా బి.సి సర్పంచ్ లను గెలిపించుకుందాం
ధర్నాలు చేసినం, ధరకాస్తులిచ్చినం, నిరాహార దీక్షలు చేసినం, నిలదీసి అడిగినం. బలిదానాలు చేసుకున్నాం, బరిగీసి కోట్లాడుతున్నాము.
పాద యాత్రలు చేసినం, కోర్టుల్లో కొట్లాడినం. అయినా మన బి.సి వాటా బి.సి లకు ఇస్తలేరు.
మనం ఓట్లేసి అధికారం వాళ్లకు ఇచ్చుడేంది. మళ్ళీ అడుక్కునుడేంది?
బానిసత్వం వీడుదాం ఓటు ఆయుధంతో రాజులమవుదాం
బానిసలారా లేండిరా ఈ బానిస బతుకులు వద్దురా. అడుక్క తింటే అధికారం రాదురా, ఓటుతో గుద్ది గుంజుకోవాలిరా
80 ఏండ్ల స్వాతంత్ర భారత దేశంలో రాజ్యాంగ హక్కులు లేక, రాజకీయ పదవులు లేక, స్వాభిమానం లేకుండా బతుక లేక బలిదానాలు చేసుకుంటున్న మెజార్టీ సమాజమైన బి.సి స్థితిగతులు మార్చడం కోసం జరుగుతున్న పోరాటాలను బి.సి ప్రజలు అర్థం చేసుకొని మాసుకోవాల్సిన అవసరముంది. వేల సంవత్సరాల నుండి మానవ మనుగడ కోసం నిత్యం శ్రమలో, ఉత్పత్తిలో పాల్గొంటున్న బి.సి లు పాలకుల కుట్రల వల్ల గత 40 బతుకలేక వలసలు పోతున్న దుస్థితి. అంబేద్కర్ కృషి, పోరాటం వల్ల ఎస్సీ, ఎస్టీ లకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడినాయి. తద్వార ఆ వర్గాలు అభివృధి బాటలో నడుస్తున్నారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో పైనున్న ఆధిపత్య కులాలకు రాజకీయ పార్టీలు, ఆస్తులు, భూములు, పరిశ్రమలు, వ్యాపారాలు ఉన్నాయి. కింద కులాలకు రాజ్యాంగపరమైన హక్కులున్నాయి. ఏ హక్కులు లేకుండా, ఏ గౌరవం లేకుండా దేశంలో బతికే సమాజం ఏదైనా ఉంది అంటే అది బి.సి సమాజం అనేది జగమెరిగిన సత్యం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి బి.సి హక్కుల కోసం, సకల సామాజిక రంగాల్లో బి.సి వాటా కోసం, చట్టసభల్లో చట్టపరంగా బి.సి వాటా కోసం, కుల జనగణన కోసం ఎన్నో పోరాటాలు జరిగినా బి.సి ల గోడును పట్టించుకున్న నాధుడు లేడు. 1953 కాకా కాలేల్కర్ కమీషన్ మొదలుకొని కామారెడ్డి డిక్లరేషన్ వరకు ఎన్ని కమీషన్లు నివేదికలు సమర్పించినా, రాజకీయ నాయకులు ఎన్ని వాగ్దానాలు కుమ్మరించినా వాటి అమలు నీటి మీద వ్రాతలుగానే మిగిలిపోయాయి. అయినా వీటిని బి.సి సమాజం అర్థం చేసుకునే కనీస జ్ఞానం కలిగి లేరు. పర్యవసానంగా బి.సి లకు మోసం చేస్తున్న పార్టీలకే ఓట్లు వేసి గెలిపించి అధికారంలో కూర్చోబెడుతున్న దుస్థితిలో బి.సి సమాజముంది.

బార్డర్ లో బి.సి లే మనమే, బాడీ గార్డులుగా బి.సి లే ఏ హక్కులు లేకుండా నిత్యం దోపిడీకి గురయ్యేది బి.సి లే
ఇంతవరకు బాధితుల పక్షాన బాధలు లేని వారు పోరాటం చేశారు. దాంతో బి.సి లు మరింత నష్టపోతున్నారు. బి.సి సమాజానికి జరుగుతున్న నష్టాలకు తిరుగుబాటు చేసిన బి.సి లు ఒక పార్టీని దించి మరో పార్టీని ఎక్కించగలిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించగలిగారు. కానీ బి.సి లు విముక్తి చెందలేదు. ఆయా రాజకీయ పార్టీలను అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర పోషిస్తున్న బి.సి సమాజం నష్టపోతున్న తీరును గమనించలేకపోతున్నారు. బి.సి లు స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగి వారి ఓట్లు వారికి వేసుకున్న నాడే రాజ్యం హస్తగతమవుతుంది. అప్పుడే విముక్తి సాధ్యమవుతుంది. మహాత్మా జ్యోతిబా పూలే ఇచ్చిన విద్య జ్ఞానంతో, అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో రాజ్యాన్ని బి.సి లు హస్తగతం చేసుకోవాలి.
ఈ సందర్భంగా తెలంగాణలో బి.సి ల ముందుకు వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో బి.సి అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరముంది. ఓట్లేసి గెలిపించుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ని మొరలు పెట్టుకున్నా, ఎంత వేడుకున్నా బి.సి వాటా ఇవ్వడం లేదు. 1990 నుండి కోర్టులు సైతం బి.సి లకు వ్యతిరేకంగానే తీర్పులు ఇస్తున్నాయి. బి.సి ల చేతిలో ఉన్నది ఒక ఓటు మాత్రమే. ఆ ఓటుతో పల్లెను గెలుద్దాం, డిల్లీని ఏలుదాం.
పార్టీ ఏదైనా బి.సి కి ఓటెద్దాం.. బి.సి లను గెలిపించుకుందాం. బి.సి శక్తి ఏందో చూపిద్దాం
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే విముక్తి సాధ్యం కాదు.
….సాయిని నరేందర్
న్యాయవాది
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్
9849106654
9701916091



rút thưởng 188v tự hào sở hữu danh mục trò chơi độc quyền, mang đậm dấu ấn cá nhân hóa, giúp người chơi tìm thấy sự khác biệt so với các nền tảng thông thường. TONY01-16
You got a very excellent website, Sword lily I found it through yahoo.