ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
ఆల్ ఇండియా ఒబిసి జాక్ హనుమకొండ జిల్లా కమిటి ఎన్నిక
అధ్యక్షులుగా తాడిశెట్టి క్రాంతికుమార్
తరతరాలుగా ఉత్పత్తి శ్రమలో కీలకపాత్ర పోషిస్తున్న బి.సి సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చడమే ఆల్ ఇండియా ఒబిసి జాక్ లక్ష్యమని ఎఐఒబిసి జాక్ జాతీయ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రం టి ఎన్ జి ఒ భవన్ లో చాపర్తి కుమార్ గాడ్గే అధ్యక్షతన బుధవారం జరిగిన ఆల్ ఇండియా ఒబిసి జాక్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ హితం కోసం నిత్యం శ్రమ చేస్తున్న బి.సి సమాజం నేడు బ్రతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని, దేశం అభివృద్ధి చెందుతుంటే బి.సి లు మాత్రం ఆగమవుతున్నారని, బి.సి సమాజాన్ని కాపాడుకోవాలంటే బి.సి సమాజాన్ని రాజకీయ శక్తిగా మార్చి చట్టసభల్లో వాటా సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి పోరాటంలో బి.సి లు ముందుండి ఎన్నో త్యాగాలు చేస్తున్నప్పటికీ అధికారం, అభివృద్ధిలో మాత్రం అణచివేయబడుతున్నా రని, బి.సి ల ఆత్మగౌరవమే ఎజెండాగా ఉద్యమించాలని అన్నారు. పాలక వర్గ పార్టీలు అధికారం కోసం ఐక్య సంఘటనలుగా మారుతుంటే బి.సి సంఘాలు మాత్రం 100 సంఘాలుగా విడిపోయి పాలక వర్గాలకు పావులుగా మారారని, విడిపోయిన బి.సి సంఘాలను, కుల సంఘాలను ఐక్యం చేయడమే ఆల్ ఇండియా ఒబిసి జాక్ లక్ష్యమని ఆయన అన్నారు.
హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన వరకు అన్ని పోరాటాల్లో బి.సి లు ఎన్నో త్యాగపూరిత పోరాటాలు చేశారని, త్యాగాలు బి.సి లవి బోగాలు ఆధిపత్య వర్గాలవి అయ్యాయని ఈ స్థితిని మార్చడంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుకై అన్ని బి.సి సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని అన్నారు. నాపై నమ్మకంతో నన్ను ఎఐఒబిసి జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకన్నందుకు ఆది నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు ఎన్నుకోబడిన జిల్లా కమిటీతో సమన్వయంతో పని చేస్తానని అన్నారు.
ఎఐఒబిసి హనుమకొండ జిల్లా కమిటి
హనుమకొండ జిల్లాలోని వివిధ కుల, ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో జరిగిన ఎన్నికలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా తాడిశెట్టి క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శిగా గొల్లపల్లి వీరాస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి వెంకటాచారి, కోశాధికారిగా తాడూరి మోహన్, ఉపాధ్యక్షులుగా వల్లాల జగన్ గౌడ్, తాటికొండ సద్గుణ, రుద్రోజు నవీన్ కుమార్, రాచమల్ల శ్రీనివాస్, మహ్మద్ ఇస్మాయిల్, జాయింట్ సెక్రటరీలుగా సూరం నిరంజన్, జల్లెల కృష్ణమూర్తి, నలబోల రవికుమార్, నారాయణగిరి రాజు, ప్రధాన సలహాదారుగా పులి రజనీకాంత్ ముదిరాజ్, గౌరవ అధ్యక్షులుగా పులి శ్రీనివాస్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా రాజు యాదవ్, మొయినోద్దీన్ లను ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీకి సమావేశానికి హాజరైన తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, బి.సి పొలిటికల్ జాక్ నాయకులు మాదం రజనీకుమార్ యాదవ్, ఎఐఒబిసి జాక్ రాష్ట్ర నాయకులు కూనూరు రంజిత్ కుమార్ గౌడ్, బిఎల్ఎఫ్ వరంగల్ జిల్లా నాయకులు ఐతం నగేష్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కేడల ప్రసాద్, పూలే, అంబేద్కర్ సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అద్యక్షులు పోతరాజు లక్ష్మీనారాయణ, తెలంగాణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు చొల్లేటి కృష్ణమాచారి, విశ్వ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు పొడిశెట్టి విష్ణువర్ధన్, భారత్ బచావో నాయకులు దొమ్మాటి ప్రవీణ్ కుమార్, పండుగ వెంకటేశ్వర్లు, తదితరులు అభినందనలు తెలిపారు.


uay5y9
As I website owner I believe the content here is rattling great, thankyou for your efforts.
you’ve gotten an important blog right here! would you like to make some invite posts on my weblog?