(ఎంజీఆర్..ఎన్టీఆర్..
జయలలిత కోవలో విజయ్)
(ఎలిశెట్టి సురేష్ కుమార్)
9948546286
7995666286
ఒకనాడు
కరుణానిధి..
1969లో
తర్వాత..
ఎంజీ రామచంద్రన్..
1977లో..
ఆపై..
నందమూరి తారకరామారావు
1983లో..
పిదప..
జయలలిత..
1991లో..
అంతకు మునుపే..
అన్నాదురై..
1967లో..
పెద్దాయనకు కూడా సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నాయి..
జయలలితకు ముందు..
ఎంజీఆర్ సతీమణి జానకి..
1988 లో 23 రోజులు మాత్రమే తమిళ ముఖ్యమంత్రి..
కాకపోతే ఆ రాష్ట్రానికి తొలి
మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు..ఆమె కూడా కొన్ని
సినిమాల్లో నటించారు..
సినిమా రంగానికి చెందిన
ఈ ఆరుగురూ ముఖ్యమంత్రులుగా పనిచేసి
తమ మాతృరంగానికి విశేష కీర్తిప్రతిష్టలు సముపార్జించి పెట్టారు..
ఇప్పుడు..
దళపతి విజయ్..
ఇప్పటి ట్రెండ్ ఖాయమై..
పొత్తులు కుదిరి..
అన్నీ కలిసివచ్చి..
ఆయన తమిళనాడులో
సినీరంగం నుంచి
ఏడో ముఖ్యమంత్రిగా
బాధ్యతలు చేపడితే..
సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టే..
ఆంధ్రలో ఎన్టీఆర్ ఎంట్రీ తర్వాత..
తమిళనాడులో కరుణానిధి..
ఎంజీఆర్.జయలలిత తర్వాత
ఎందరో నటులు..ప్రధానంగా హీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఆ స్థాయిలో
సక్సెస్ కాలేకపోయారు.
అలా రాజకీయంగా తమ
అదృష్టాన్ని పరీక్షించుకున్న
సినీ ప్రముఖుల్లో..
అమితాబ్ బచ్చన్,సునీల్ దత్ మొదలుకుని..
శివాజీ గణేశన్..వినోద్ ఖన్నా..
రాజేష్ ఖన్నా.. జయబాధురి..
హేమమాలిని..
వైజయంతిమాల..
శత్రుఘ్న సిన్హా..
మన తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ,జమున,,దాసరి నారాయణరావు,కృష్ణంరాజు..
మోహన్ బాబు..మురళీ మోహన్..రావు గోపాలరావు..కైకాల సత్యనారాయణ..రామానాయుడు..కోట శ్రీనివాసరావు,
బాబూ మోహన్..
జయప్రద,శారద,
జయసుధ…తాజాగా రోజా..:
ఇలా పెద్ద జాబితానే ఉంది..
తమిళనాడు..కేరళ.. కర్నాటకతో పాటు ఒడిషా
తదితర రాష్ట్రాల నుంచి
కూడా సినిమా ప్రముఖులు
ఏదో ఒక దశలో..ఏదో ఒక లెవెల్లో రాజకీయాల్లో తమ
అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే..
అయితే వీరంతా కాంగ్రెస్..బీజేపీ..తెలుగుదేశం వంటి పార్టీల ద్వారా మాత్రమే
రాజకీయరంగంలో
ప్రవేశించి ఎమ్మెల్యే..ఎంపీ
అయితే కొందరు రాష్ట్రాల్లో..కేంద్రంలో కూడా మంత్రులు కాగలిగారు..
వీరు గాక ఇంకో స్పెషల్ జాబితా ఉంది.. సొంతంగా పార్టీ పెట్టి చరిత్ర సృష్టిద్ధామనో..
ఎంజీఆర్..ఎన్టీఆర్..
జయలలిత వలె తిరగరాద్దామనో
రాజకీయ ప్రవేశం చేసిన
నటులు..ప్రధానంగా హీరోలున్నారు..
మన రాష్ట్రంలో స్వయంగా
మెగాస్టార్ చిరంజీవి
ఎంతో అట్టహాసంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి..
అధికారం చేపట్టలేకపోగా
ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ తరపున కేంద్ర మంత్రి పదవిలో కొన్నాళ్లు వెలిగి ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
చిరంజీవి తర్వాత ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంకా హడావుడిగా జనసేన పార్టీని ఏర్పాటు చేసి మొదట్లో విఫలమైనా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమిలో భాగస్వామిగా చేరి నేను సైతం రాజకీయ నాయకుడినే అన్న చందాన సక్సెస్ సాధించి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా తన ఉనికిని ఘనంగా చాటుకుంటున్నారు.
ఇక తమిళనాడు విషయానికొస్తే ఎంజీఆర్ జయలలిత తర్వాత అంత స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉన్న రజనీకాంత్ ఆ మధ్య సొంతంగా పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టిద్దాం అనుకన్నా ఈ రాజకీయాలు మన ఒంటికి సరిపడావులే అనుకున్నారేమో
ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
ఆయన తర్వాత అంతే స్థాయిలో సూపర్ స్టార్ అయిన కమలహాసన్ సైతం సొంతంగా పార్టీ పెట్టి తన ఇమేజ్ కి తగినట్లుగా రాణించలేకపోయారు.
ఈ మధ్యలో విజయ్ కాంత్, శరత్ కుమార్ వంటి వారు సైతం రాజకీయాల్లో చేయి వేసి కాల్చుకున్నారు కూడా..
ప్రకాష్ రాజ్ ఆదిలోనే
వివాదాలు కొనితెచ్చుకుంటూ
ఇబ్బందులు పడుతున్నారు.
ఇంకాస్త వెనక్కి వెళ్తే తమిళనాడులో
చో రామస్వామి…
మన తెలుగులో విఖ్యాత నటుడు కొంగర జగ్గయ్య రాజకీయంగా తమ ఉనికిని చాటుకున్న ప్రముఖులే..
మొత్తానికి ఎంజీ రామచంద్రన్,
ఎన్టీ రామారావు..
జయలలిత తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా సినీ ప్రముఖులు ఎవరూ కూడా రాజకీయాల్లో హీరోగా తమ ప్రభావాన్ని చాటలేకపోయారు.
ఇప్పుడు ఆ మచ్చను దళపతి విజయ్ చెరపపేస్తున్నట్టే.
ప్రతివారు ఎంజీఆర్ కాలేరు..
అలాగే ఎన్టీఆర్ అనిపించుకోలేరు..
జయలలితలా కూడా నిరూపించుకోలేరు ..
సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు.. వెళ్ళిపోతారు అన్న మచ్చను కొంతవరకు మన పవన్ కళ్యాణ్ చెరిపిస్తే, తమిళనాడులో విజయ్ సినిమా నటుల కోసం మరో కొత్త పేజీని రాజకీయాల్లో సృష్టించారు.
ఇక్కడ మరొక పోలిక..
ఇది ఇన్నాళ్ళూ ఎన్టీఆర్ పేరిట మాత్రమే ఉన్న ఒక చారిత్రక రికార్డు..తెలుగునాట పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే
అనూహ్య స్థాయిలో విజయం
సాధించి ముఖ్యమంత్రి అయిన ఘనత తెలుగు విభవుడు రామారావుకు
మాత్రమే సొంతం..
ఆయన తొలి ప్రయత్నంలోనే
అప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో వేళ్ళూనుకుపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి
ఇంకే పార్టీ సహకారం అవసరం లేకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని
అధిష్టించారు..
ఇప్పుడు విజయ సైతం
తొలి ప్రయత్నంలోనే
హిట్టు కొట్టినా..
పొత్తు లేనిదే ముఖ్యమంత్రి అయ్యే పరిస్ధితి మాత్రం
లేదు..
ఆ కోణంలో మాత్రం
నందమూరి రికార్డు..
మహా పదిలం..!

