గురువారం ఉదయం మేడారం జాతర ఏర్పాట్లను బైక్‌లపై పరిశీలించిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రులతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఇతర అధికారులు
మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కల్పించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రులు
పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు
సారలమ్మ రాకతో మేడారానికి పోటెత్తిన భక్తజనం
జంపన్న వాగులో జలకళ… పుణ్యస్నానాలతో భక్తుల సందడి
మేడారం అంతా ఎటు చూసినా భక్తులే
క్యూ లైన్లలో కిక్కిరిసిన భక్తజనం
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తల్లుల దర్శనానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు
నేడు సమ్మక్క రానున్న నేపధ్యంలో పెరుగుతున్న
భక్తుల రద్దీ
సమ్మక్క ప్రతిష్ఠ అనంతరం మరింత రద్దీకి అవకాశం
రద్దీని తట్టుకునేలా ముందస్తు చర్యలు చేపట్టిన యంత్రాంగం
తల్లుల ఆగమనానికి సర్వం సిద్ధం
సాయంత్రం చిలకగుట్ట నుంచి రానున్న సమ్మక్క తల్లి
సమ్మక్క తల్లిని తీసుకురానున్న ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, ఆయన వెంట మాల్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్
ఇప్పటికే చిలకగుట్ట నుంచి ఆలయ ప్రాంగణం వరకు రోప్ పార్టీ ట్రయల్ రన్ పూర్తి
భక్తుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్స్, అగ్నిమాపక, వైద్య శాఖల బృందాలు అప్రమత్తం
ప్రచురణార్థం
*పకడ్బందీగా కొనసాగుతున్న మేడారం మహా జాతర….. రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
**అవసరమైన వారికి తగిన వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు*
*అధికారులతో సమక్క సారలమ్మ జాతరను నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం*
తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా కొనసాగుతున్నది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లను గురువారం ఉదయం బైక్ ల పై జిల్లా కలెక్టర్ దివాకర ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. మేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు గల ఏర్పాట్లను, పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యం స్వయంగా తిరిగి పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు.
*మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ*
జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే మహా జాతరలో తప్పిపోయిన వ్యక్తులను తిరిగి వారి కుటుంబానికి చేర్చే దిశగా తప్పిపోయిన వ్యక్తుల ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
మేడారం మహా జాతర సందర్భంగా పారిశుధ్య చర్యలు కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతున్నది. జాతరలో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తుందని అన్నారు
మేడారం పరిసరాలతో పాటు భక్తుల దర్శనానికి వెళ్లే అన్ని సెక్టార్లలో పరిశుభ్రత పాటించడం జరుగుతున్నది, అమ్మవారి గద్దెల వద్ద శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టడం జరిగింది, అధికారుల నిరంతర పర్యవేక్షిస్తూ గద్దెల వద్ద బెల్లం, భక్తులు సమర్పించే మొక్కలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారని పేర్కొన్నారు
ఈ పర్యటనలు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

