భిర్యాని అకుల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

 వంటింట్లో ఉండే ఔషధాలలో బిర్యానీ ఆకు కూడా ఒకటి. ఈ ఆకుని కేవలం బిర్యానీ లోనే కాకుండా ఇతర వంటకాలలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ బిర్యానీ ఆకు వంటలకు మంచి రుచి ఇవ్వడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఈ ఆకులను పొడి చేసి లేదా నేరుగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి, గుండెసమస్యల వంటి ప్రమాదకర సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు పొడిని నీటిలో కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగితే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్ లు విటమిన్ సి బిర్యానీ ఆకులో పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను నివారించడంలోనూ ఈ ఆకు కీలకంగా పనిచేస్తుంది. ఇక దాల్చినచెక్క, ఫ్రెంచ్ ఆకు టీ బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.

బిర్యానీ ఆకుల్లో సహజంగా ఉన్నటువంటి యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు, గొంతు నొప్పి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సాధారణ కీళ్లనొప్పులతో పాటు ఆర్థరైటిస్,రుమటాయిడ్ వంటి దీర్ఘకాల వ్యాధులను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉండడంవల్ల వీటిని ప్రతిరోజు కషాయంగా తీసుకుంటే మన శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి. కొలన్ క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్, వంటి వాటి నుండి బయటపడవచ్చు. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో బాగా దోహదపడుతుంది. 

బిర్యానీ ఆకులో ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటుంది. 100 గ్రాముల బిర్యానీ ఆకుల్లో 180 గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా సాగ‌డానికి ఇది స‌హాయ‌ప‌డుతుంది. కాబ‌ట్టి ఇది గ‌ర్భిణీల‌కు చాలా అవ‌స‌రం. ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో, ప్ర‌స‌వానంతరం క‌డుపులో బిడ్డ‌కి, గ‌ర్బిణీ స్ర్తీకి ఫోలిక్ యాసిడ్ చాలా అవ‌స‌రం. గ‌ర్భిణీలు వంట‌కాల్లో బిర్యానీ ఆకు చేర్చుకోవ‌డం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.

అలాగే అతి బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేలా చేయటంలో , హైపర్ టెన్సన్ నుండి విముక్తి పొందవచ్చు. ఇందులో ఉండే చాలా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు, చర్మానికి ఉపయోగపడతాయి. మొటిమలు తగ్గించడంతోపాటు, స్కిన్ ను తాజాగా మారుస్తుంది. చుండ్రు నివారించి, పేలును తొలగిస్తుంది. విట‌మిన్ ఎ లోపంతో బాధ‌ప‌డేవాళ్లు బిర్యానీ ఆకుల‌ను ఒక పూట ఆహారంలో చేర్చుకుంటే కంటిచూపు స‌మ‌స్య‌లు ఉండ‌వు.

Share this post

2 thoughts on “భిర్యాని అకుల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో