ఎప్పుడో 46 ఎండ్ల క్రితం తన తండ్రి ని చంపిన మాజీ నక్సలైట్ ను చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
అసలు విషయం ఏమంటే మాజీ నక్సలైట్
యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ అతని చావుకు తెచ్చింది. తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన పీపుల్స్ వార్ మాజీ నక్సలైట్ బెల్లపు సిద్దన్న అలియాస్ నర్సయ్య (58)ను వేములవాడ అర్బన్ మండలం జగిత్యాల పట్టణానికి చెందిన జక్కుల సంతోశ్ అనే వ్యక్తి హతమార్చి జగిత్యాల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే సుమారు 46 ఏళ్ల క్రితం తాను అజ్ఞాతంలో ఉన్న సమయంలో సంతోష్ తండ్రి పెద్దన్నను పార్టీ ఆదేశాలతో అప్పట్లో హతమార్చినట్లు నర్సయ్య ఇటీవల ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. యూట్యూబ్ లో సిద్దన్న ఇంటర్వ్యూ చూసిన సంతోష్ ఉడికిపోయాడు. తన తండ్రిని చంపిన హంతకుడు కండ్ల ముందే తిరుగు తున్నాడని కోపం తో రగిలి పోయాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం వేశాడు.
నర్సయ్య తాను అభిమా నిని అంటూ పరిచయం చేసుకొని స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం అగ్రహారం గుట్టకు పిలిచి నర్సయ్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు నేరుగా వెళ్లి లొంగి పోయాడు.
వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కలకలం…
ఈ ఘటన మాజీ నక్సలై ట్లను కలవర పరిచింది. లొంగి పోయి జన జీవనంలో కల్సి పోయిన మాజీ నక్సలైట్లు తెలంగాణ వ్యాప్తంగా వందలు వేళల్లో ఉన్నారు.
వీరిలో చాలామంది వెంటపడి యూట్యూబర్లు ఇంటర్వ్యూ లు చేస్తున్నారు.
ఇది ప్రస్తుతం ఓ ట్రెండ్ అయింది. అలాంటి ఇంటర్వ్యూ ల వళ్లే ఇలాంటి అనర్థం జరుగుతుంది అని ఈ సంఘటన రుజువు చేసింది.
మాజీ నక్సల్స్ చేసిన ఘన కార్యాలు చెప్పుకుంటే పాపులర్ కావడం అటుంచి ఇలా ప్రాణాలు పోతాయని గ్రహించాలి.
ఇప్పుడు రోజులు మారిపోయాయి.
మాజీ మావోయిస్టు, బీఆర్ఎస్ నేత దారుణ హత్య-యూట్యూబ్ ఇంటర్వ్యూ ఫలితం

