మంత్రి కొండా సురేఖ విషయంలో ఓ తుఫాను తప్పదనుకుంటే అదికాస్త ఆరంభంలోనే సద్దుమనగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరిచింది.
ఏం జరగలేదనే అంతాఓకే అనే సంకేతాలు ఇచ్చేందుకు దిపావళి పండగ సందర్బంగా పిసిసి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ డిప్యూటి సిఎం మల్లు విక్రమార్కభట్టి సమక్షంలో మంత్రికొండా సురేఖ ఆమె భర్తసీనియర్ కాంగ్రేస్ పార్టి నేత కొండా మురళి ధర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు.
అందరూ కల్సి హాపీగా పోటో దిగి సోషల్ మీడియాలో పోస్టుచేసారు. ఏదో జరుగుతుందని మంత్రి కొండా సురేఖను మంత్రిపదవి నుండితొలగించి బిసి సామాజిక వర్గాల్లో మరొకరికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.
ఎవరి ఊహాగానాలు కూడ ఫలించలేదు. చివరికి ఇలా చిరనవ్వుల ఫోటో సెషన్ తో తుఫాను సద్దుగింది.
ముఖ్య మంత్రికి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపి ఊరికే ఉండలేరు కదా. తాజా పరిణామాలపై కూడ చర్చ జరిగి ఇక నుండి జాగ్రత్తగా ఉండేలా ఓ అంగీకారానికి వచ్చి ఉంటారు.
గొడవకు కారణాలు మంత్రి సురేఖ ప్రైవేట్ OSD సుమంత్ వ్యవహారం, మేడారం పనుల కాంట్రాక్టుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాలు, సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలు (సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి మీద కుట్రలు) వంటివి ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసాయి. ఇటీవల మంత్రివర్గ సమావేశానికి సురేఖ గైర్హాజరు అయ్యారు. పార్టి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పార్టి పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ను కల్సి వివరణ ఇచ్చారు. అర్ద రాత్రి పోలీసులు మంత్రి అయిన తన ఇంటికి రావడంపై కొండాసురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈవిషయంలో సహచర మంత్రులు ఇతర బిసి వర్గాలు కూడ బహిరంగంగా ఈ విషయాన్ని ఎత్తి చూపాయి.
సురేఖ తన భర్త, సీనియర్ కాంగ్రెస్ నేత కొండా మురళి ధర్ రావు సహా పార్టీ పెద్దలతో సమావేశాలు జరిపారు. మురళి ధర్ రావు సీఎంతో మాట్లాడి, “వైరుధ్యాలు లేవు, సమస్యలు పరిష్కరిస్తాం” అని చెప్పారు.
ప్రస్తుతం బిసీలు రాజకీయ అసంతృప్తులతో ఉద్యమ బాట కు సిద్దమవుతున్నారు. ఈతరుణంలో కొండాసురేఖ పై చర్య ఉపక్రమిస్తే ఆగ్రహ జ్వాలలు రగులుతాయని పార్టి ఆలోచించి మద్యే మార్గంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లుచర్చ జరుగుతోంది.