జనగాం లో లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన ఇంజనీర్

జనగాం జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర విద్యా & సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో క్షేత్ర ఇంజనీర్ గా పొరుగు సేవల పై పనిచేస్తున్న ఉద్యోగి సామల రమేష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

ఫిర్యాదుదారుడు ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం క్రింద పూర్తిచేసిన నిర్మాణ పనులకు సంబంధించిన చివరి బిల్‌ను ప్రాసెస్ చేసి తదుపరి చర్యల కోసం పంపించేందుకు అధికారిక సహాయం అందించాలన్న కారణంగా, రమేష్ మొదటగా రూ.18,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అందులో ముందుగానే రూ.10,000 తీసుకున్న రమేష్, మిగతా రూ.8,000 తీసుకుంటూ 25.09.2025 భాధితుని ఫిర్యాదుతో, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.

ప్రజలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినపుడు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని కోరారు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Share this post

10 thoughts on “జనగాం లో లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన ఇంజనీర్

  1. Together with almost everything that appears to be building throughout this specific subject material, your points of view are generally very exciting. However, I appologize, because I do not subscribe to your entire theory, all be it exhilarating none the less. It seems to everybody that your comments are not entirely validated and in actuality you are generally yourself not totally certain of the point. In any case I did take pleasure in examining it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం