హైటెక్స్‌లో “కొలువుల పండుగ”: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైటెక్స్‌లో “కొలువుల పండుగ”: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం జరిగిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ –

  • ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా, వారి సమస్యలను పూర్వ ప్రభుత్వం పరిష్కరించలేదని విమర్శించారు.
  • రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని తెలిపారు.
  • తెలంగాణ చరిత్రలో జరిగిన అన్ని పోరాటాలు భూమి కోసం జరిగాయని, కొమురంభీం, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి యోధులు భూమి కోసం పోరాడారని గుర్తు చేశారు.
  • భూదాన్ ఉద్యమానికి తెలంగాణ నేల పునాదిగా నిలిచిందని, వెదిరె రామచంద్రారెడ్డి వేల ఎకరాలు పేదలకు పంచిన సంగతిని ప్రస్తావించారు.
  • పీవీ నర్సింహారావు కాలంలో వ్యవసాయ సీలింగ్ చట్టం ద్వారా అసైన్‌డ్ భూములు పేదలకు ఇచ్చిన విషయం గుర్తుచేశారు.

ధరణి సమస్యపై మాట్లాడుతూ –

  • గత పాలకులు ధరణి వ్యవస్థను తీసుకువచ్చి భూములను కొల్లగొట్టాలని చూశారని ఆరోపించారు.
  • ధరణితో విసిగిపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలను ప్రస్తావించారు.
  • ధరణి వ్యవస్థను తొలగించి, “భూభారతి” చట్టాన్ని తీసుకువచ్చామని, పేదల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి –

  • “మీపై గత పాలకులు మోపిన మచ్చను చెరిపేసుకునే అవకాశం ఇది. మీరు పేదల సమస్యలకు వారధులుగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.
  • ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టలేమని ఉదాహరణ ఇచ్చారు.
  • కొందరి తప్పుల కారణంగా మొత్తం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం అన్యాయం అని అభిప్రాయపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా వ్యాఖ్యానించిన సీఎం, “లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడు ఏళ్లలో కూలేశ్వరం అయింది, మరి వారిని ఏమని పిలవాలి?” అని ప్రశ్నించారు.

చివరగా, భూభారతి చట్టం అమలు చేయడం, బైనామా సమస్యలను పరిష్కరించడం మీ ఆత్మగౌరవం అని ఉద్యోగులను ఉద్దేశించి సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు నిజం తెలియజేసి, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Share this post

One thought on “హైటెక్స్‌లో “కొలువుల పండుగ”: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి