ములుగు జిల్లాలో వరదలో చిక్కుకున్న నలుగురిని కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు


ములుగు, ఆగస్టు 18: ములుగు జిల్లా ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో సోమవారం రాత్రి వాగు ప్రవాహంలో చిక్కుకున్న నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
అధికారుల వివరాల ప్రకారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదేశాల మేరకు సహాయ బృందం వారిని కాపాడిందని తెలిపారు.

పశువులను మేపేందుకు వెళ్లిన దుబారి రామయ్య, అలాగే చేపలు పట్టేందుకు వెళ్లిన పి. సాయికిరణ్, రాజబాబు, పి. రాములు భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి జాలదిగ్ బంధం లో చిక్కుకున్నారు.

సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో వాగు ప్రవాహం వేగంగా పెరుగుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న ఎమ్మార్వో సురేష్, కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు. వెంటనే ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వాగు ఉద్ధృతంగా ఉండడంతో తాడుతో సహాయంగా ముందుగా పశువుల కాపరి రామయ్యను రక్షించి ఒడ్డుకు చేర్చారు.
తరువాత బృందం వాగు వెంబడి కిలోమీటర్ దూరం వెతికి చేపలు పట్టేందుకు వెళ్లిన సాయికిరణ్, రాజబాబు, రాములను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తో పాటు ఏఎస్ఐ సుధీర్, సురేందర్, హెడ్ కానిస్టేబుల్ జగదీష్, చంద్ర, రమేష్, కానిస్టేబుల్ ఆనంద్, రమణమూర్తి, విశాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే తాడ్వాయి మండలం నుండి ఎమ్మార్వో సురేష్, ఎంపీడీవో, ఎస్సై, రెవెన్యూ సిబ్బంది కూడా సహకరించారు.
సకాలంలో నలుగురి ప్రాణాలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి జిల్లా కలెక్టర్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో