విశ్రాంత కళాశాలల అధ్యాపకుల సంఘం (Retired Collage Teachers Association,Telangana) అధ్వర్యంలో జూలై 20వ తేది ఆదివారం హన్మకొండలోని సర్కూట్ హౌజ్ రోడ్ లో తుషారా కాలేజి ఎదురుగా ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ లో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు పులిసారంగపాణి,ప్రధానకార్యదర్శి డాక్టర్ బి.మల్లారెడ్డి తెలిపారు.
ప్రభుత్వ రిటైర్డ్ కళాశాలల అధ్యాపకులు తమకుటుంబ సభ్యులు శిబిరాన్ని సద్వినియోగ చేసుకోవాలని కోరారు. ఉదయం 7గంటల నుండి ప్రారంభమయ్యే శిబిరంలో షుగర్,బాడీమాస్ ఇండెక్స్, బీపి,బోన్ మ్యారో పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఇతర పరీక్షలు అవసరం అయిన వారికి 50 శాతం రాయితీతో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
జనరల్ ఫిజిషియన్స్, హృద్రోగ నిపుణులు, ఎముకల వైద్య నిపుణులు, స్త్రీవైద్య నిపుణులు శిబిరంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.