హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన గ్రాండ్ ఫినాలే

హైదరాబాద్‌లో మిస్సవరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే జోష్‌లో జరిగింది. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అందాల పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత సువాంగ్ విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ విజేతగా ఆమె కిరీటాన్ని ధరించడంతో మాస్‌లో హర్షధ్వానాలు మిన్నంటాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ చైర్‌పర్సన్ జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ 2006 విజేత క్రిస్టినా పిజ్కోవా కలిసి ఓపల్‌కు కిరీటాన్ని అలంకరించారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా అద్భుతమైన డ్రెస్‌తో స్టేజ్ పైకి వచ్చిన సమయంలో ప్రేక్షకులు చప్పట్లతో స్వాగతం పలికారు.
ఈ వేడుకలో బాలీవుడ్ యాక్టర్ ఇషాన్ కట్టర్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అందరినీ ఉర్రూతలూగించాడు. మరోవైపు సినీ నటుడు సోనీ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. కరోనా సమయంలో ఆయన చేసిన మానవతా సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించారు. టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఈ అవార్డును అందజేశారు.
ఫైనల్ రౌండ్‌లో నిర్వాహకులు ఖండాల వారీగా టాప్ ఇద్దరినుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్ నలుగురు ఈవిధంగా ఉన్నారు:

- మార్టినిక్ (అమెరికా ఖండం నుంచి)
- ఇథియోపియా (ఆఫ్రికా ఖండం నుంచి)
- పోలెండ్ (యూరోప్ నుంచి)
- థాయిలాండ్ (ఆసియా నుంచి)
ఈ పోటీలో భారత్ నుంచి పోటీ చేసిన నందిని గుప్తా ఫైనల్ రౌండ్‌కు ముందే నిష్క్రమించారని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఏడాది మిస్ వరల్డ్ కార్యక్రమం భారత్‌లో జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత సంస్కృతి, అతిథి సత్కారం అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిసిపోయాయి.







మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం
హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావటంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో, దిశానిర్దేశంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
మిస్ వరల్డ్ సంస్థ, ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందాలు, విభాగాలు సహాయకుల అసమానమైన అంకితభావం, సమన్వయంతో కృషి చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పారు.
మీ అందరి సహకారంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని పేర్కొన్నారు. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే, తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపే అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం సదా సమాయత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
2025 మిస్ వరల్డ్ విజేతకు మంత్రి జూపల్లి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు


xn88 đã không còn là cái tên xa lạ với những người yêu thích cá cược trực tuyến. Được thành lập từ năm 2013, nhà cái này nhanh chóng vươn lên trở thành một trong những thương hiệu dẫn đầu, thu hút lượng người chơi khổng lồ.
xn88 đã không còn là cái tên xa lạ với những người yêu thích cá cược trực tuyến. Được thành lập từ năm 2013, nhà cái này nhanh chóng vươn lên trở thành một trong những thương hiệu dẫn đầu, thu hút lượng người chơi khổng lồ.
xn88 đã không còn là cái tên xa lạ với những người yêu thích cá cược trực tuyến. Được thành lập từ năm 2013, nhà cái này nhanh chóng vươn lên trở thành một trong những thương hiệu dẫn đầu, thu hút lượng người chơi khổng lồ.