వరదల్లో చిక్కిన యువతిని కాపాడిన కానిస్టేబుల్ కు ప్రశంస

మానవత్వంతో వ్యవహరించిన సీఏఆర్ కానిస్టేబుల్‌కు టీఎస్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ ప్రశంస

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్‌పర్సన్, గౌరవ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ , గత వారం నగరంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక యువతిని రక్షించి, సురక్షితంగా ఇంటికి చేర్చిన హైదరాబాదు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ ను ప్రశంసిస్తూ అభినందన పత్రం అందజేశారు.

2025 సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బంజారా హిల్స్ రహదారులు నడుము లోతు వరద నీటితో మునిగిపోయాయి.

ఈ పరిస్థితుల్లో చైర్‌పర్సన్ భద్రతా బృందంలో పైలట్-కమ్-ఎస్కార్ట్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ , రోడ్ నెం. 3 వద్ద బస్టాప్‌లో ఒంటరిగా నిలబడి భయాందోళనలకు లోనైన 22 ఏళ్ల యువతి నైనికను గమనించారు.

ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకుంటూ రామంతపూర్‌లో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చిన నైనిక, పెరుగుతున్న వరదలో ఇరుక్కుపోయింది.

నీటి భయం (హైడ్రోఫోబియా)తో విలవిలలాడుతూ, మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులను సంప్రదించలేని పరిస్థితిలో ఉండగా అదే సమయంలో, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ నడుము లోతు నీటిలోకి వెళ్లి, ఆమెకు తన జెర్కిన్ ఇవ్వడంతో పాటు ధైర్యం చెప్పి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ప్రయాణ సౌకర్యాలు లేక పోవడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆయన స్వయంగా నైనికను వానలతో ముంచెత్తిన రహదారులను దాటుతూ వనస్థలీపురంలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్ప గించారు.

ఈ సంఘటన మీడియాలో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందింది. దీనిపై డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ , హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ స్పందించిన తీరును విధి నిర్వాహణకు మించి మానవత్వం ప్రదర్శించి కర్తవ్యబద్ధతకు ప్రతీకగా నిలిచాడని అభినందించారు.

ఆయన చూపిన నిస్వార్థ సేవ నిస్సహాయ స్థితిలో ఉన్న పౌరుడి సురక్షితత్వం, గౌరవాన్ని కాపాడడమే కాకుండా, పోలీసింగ్ మరియు మానవ హక్కుల పరిరక్షణలోని అసలు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి