ఘనంగా ప్రజాకవి కాళోజీ 111వ జయంతి

Rctat wgl

విశ్రాంత కళాశాలల అధ్యాపకుల సంఘం (RCTAT) వరంగల్, అధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ 111వ జయంతి

ప్రజాకవి కాళోజీ 111వ జయంతి సందర్భంగా కాళోజి – యాది’ సభను RCTAT, వరంగల్లు శాఖ కార్యాలయంల ఘనంగా నిర్వహించారు. RCTAT వరంగల్లు అద్యక్షులు పులి సారంగపాణి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రజాకవి తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్య- మానికి కాళోజీ అందించిన స్ఫూర్తికి తాను ప్రత్యక్ష నిదర్శన మని చెప్పారు. కాళోజీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని ప్రజాస్వామ్యానికి, దిక్కార స్వరానికి, ప్రశ్నించే తత్వానికి చెందిన ప్రజల మనిషని సారంగపాణి కొని యాడారు.
ఈ సందర్భంగా మెట్టు మురళీధర్, శ్రీమతి కొమర్రాజు రామలక్ష్మి కాళోజి కవిత్త్వాన్ని పరిచయం చేశారు .
ఈ సమావేశంలో RETAT రాష్ట్ర ఉపాధ్య క్షులు. D. సత్య నారాయణ రావు , జిల్లా కార్యదర్శి Dr. B . మల్లారెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు Dr. B .వెంకటేశ్వర రావు , జిల్లా సంయుక్త కార్యదర్శి B. కృష్ణమూర్తి , RCTA సభ్బులందరు పాల్గొని కాళోజికి నివాళులర్పించారు.

తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా హనుమకొండ బాలసముద్రం లోని కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ఉన్న కాళోజీ విగ్రహానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇ.వి. శ్రీనివాస్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్, డివిజన్ అధ్యక్షులు వల్లెపు రమేష్, బంక సంపత్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఇ.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ —

“ప్రజాకవి కాళోజీ గారి రచనలు సామాజిక చైతన్యానికి దారితీశాయి. ఆయన సంకల్పం, సమాజ సేవ, సామాజిక బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఆదర్శం. కాళోజీ గారి ఆలోచనలు నేటి యువతలో విజ్ఞానం, సామరస్య భావన, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు మార్గదర్శకాలు కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి. రవీందర్, పి. రమేష్, రాజు, శ్రీనివాస్, సంజయ్, నరేష్,తోట పవన్ తదితరులు పాల్గొన్నారు .

ప్రజా కవి కాళోజీ 111వ జయంతి ఉత్సవాన్ని (తెలంగాణ తెలుగు భాష దినోత్సవం) వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనరేట్  ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాళోజీ కి నివాళులు అర్పించిన వారిలో అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్ తో పాటు ఏ.ఓ, ఏసీపీలు, ఆర్.ఐలు, ఇన్స్ స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది వున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి