శనిశింగనాపూర్ లో ముస్లిం ఉద్యోగులకు ఉద్వాసన

114 మంది ముస్లిం ఉద్యోగులను తొలగించిన శని షింగణాపూర్ దేవస్థానం

మహారాష్ట్రలోని ప్రసిద్ధ శనిదేవాలయం శనిశింగనాపూర్ సంస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

దేవస్థానం నుంచి 114 మంది ముస్లిం ఉద్యోగులను తొలగించింది. దేవస్థానం కిందికి వచ్చే వివిధ విభాగాల నుంచి హిందూయేతర సిబ్బందిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్యాత్మిక సమన్వయ ఫ్రంట్ అధిపతి ఆచార్య తుషార్ భోసలే నిరసన చేపట్టారు. ఈ 114 మంది ముస్లింలు అక్రమాలు చేస్తూ, క్రమశిక్షణా రాహిత్యంగా వుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దేశంలో శని భగవానునికి సంబంధించిన ప్రసిద్ధ దేవాలయం ఈ శనిశింగనాపూర్. ఈ ఊరి ప్రత్యేకత ఏమిటంటే.. ఏ ఇంటికీ తలుపులు వుండవు. తలుపులు లేకుండానే ఇళ్లు వుంటాయి. ధార్మిక శక్తికి చిహ్నంగా వుంటుంది. అయితే.. హైందేవతరులను కూడా ఉద్యోగులుగా తీసుకున్నారన్న విషయంపై హిందువులు చాలా రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ నిర్వహణ, పారిశుద్ధ్యం, వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో ముస్లింలు ఉద్యోగులుగా వున్నారు. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ ‘ఇదేమీ మసీదు కాదు. ఇది హిందువుల తీర్థం. కోట్లాది మంది హిందూ భక్తులు శని దేవుని ఆశీస్సుల కోసం వస్తారు. లౌకిక ముసుగులో ఇదంతా చేస్తున్నారు. లౌకికం, పరిపాలన ముసుగులో కొందరు రాజీపడుతున్నారు. దీనిని సహించం’’ అని ఆచార్య తుషార్ భోస్లే హెచ్చరించారు. దేవాలయ ట్రస్ట్ పరిధిలో వుండే ముస్లిం ఉద్యోగులను వెంటనే తొలగించాలని భోస్లే భారీ నిరసన నిర్వహించారు. ఈ నిరసనకు భక్తులు, హిందువులు హాజరయ్యారు. ధార్మిక సంస్థలు కూడా తమ మద్దతు ప్రకటించాయి.ఈ నిరసన తర్వాతే శనిశింగణాపూర్ దేవాలయ ట్రస్ట్ అధికారులు ముస్లిం ఉద్యోగులను తొలగించింది. ఇది సనాతన ధర్మానికి చారిత్రాత్మక విజయమని ఆచార్య తుషార్ భోస్లే ప్రకటించారు. ఇది పవిత్ర దేవాలయమని, ఇందులో హిందువులు వుండాలని డిమాండ్ చేశారు. నియామక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మతపరమైన నైతికతను విస్మరించడం అసంబద్ధ నిర్ణయమని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని విశ్వసించని వారు మందిరం నడిపే పాఠశాలలో వుండొచ్చా? అని హిందువులు ప్రశ్నించారు.ఇందులో చాలా మంది ముస్లిం ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో
మీకు నచ్చక పోతే మా ఉత్పత్తులు కొనకండి