Site icon MANATELANGANAA

తెలంగాణను అవమానించొద్దు.. గణాంకాలతో చర్చకు సిద్ధం: కేటీఆర్


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసిన రాష్ట్రంగా చిత్రీకరించడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంపై చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు.
తెలంగాణను ముఖ్యమంత్రే పదేపదే దివాళా తీసిన రాష్ట్రంగా చెప్పడం దురదృష్టకరం. ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పాల్సింది పోయి రాష్ట్రాన్నే విమర్శించడం సరైంది కాదు” అని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో సాగు విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 2014లో సుమారు 26 లక్షల హెక్టార్లలో సాగు ఉండగా, 2023 నాటికి అది 59 లక్షల హెక్టార్లకు పెరిగిందని పేర్కొన్నారు.
నేను నోటికి వచ్చినట్లు మాట్లాడటం లేదు. తెలంగాణ ప్రభుత్వ గణాంకాలు, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లెక్కలనే చెబుతున్నాను” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర అప్పుల విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన కేటీఆర్, పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, కాగ్ సమర్పించిన గణాంకాలే వాస్తవమని అన్నారు.
ప్రజలు సీఎం మాటలు నమ్మాలా.. లేక పార్లమెంట్‌లో సమర్పించిన ఆర్బీఐ, కాగ్ లెక్కలు నమ్మాలా?” అని ప్రశ్నించారు.
రైతు సంక్షేమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రైతుబంధు, రుణమాఫీ, కౌలు రైతుల సహాయం, పంట బోనస్ తదితర అంశాల్లో వేల కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయని అన్నారు.
రైతులకు ఇచ్చిన హామీల్లో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎగవేశారని మా లెక్కలు చెబుతున్నాయి. రైతులు యూరియా కోసం క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది” అని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలకు భారీగా నిధులు వెచ్చించామని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, రైతులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.
చర్చ ఎక్కడైనా పెట్టండి… అసెంబ్లీలోనా, ప్రెస్ క్లబ్‌లోనా, వరంగల్‌లోనా, అశోక్‌నగర్‌లోనా… తేదీ, సమయం మీ ఇష్టం. మేము గణాంకాలతో వస్తాం” అని కేటీఆర్ సవాల్ విసిరారు.
చివరగా, “మాపై విమర్శలు చేయండి.. కానీ తెలంగాణను అవమానించేలా మాట్లాడొద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత మీదే” అని కేటీఆర్ అన్నారు.

Share this post
Exit mobile version